#Film News #Info #News #Upcoming Movies

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా ‘టెంపర్’ ఆడియో డేట్ ఖరారు…..

temper-first-look-rocking-teaser-650x401యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా ‘టెంపర్’ ఆడియోను జనవరి 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

అభిమానుల సమక్షంలో హైదరాబాద్ నగరంలో ఆడియో విడుదల కార్యక్రమాన్ని భారి ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు…. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఎన్టీఆర్ సినిమాకు అనూప్ స్వరాలు సమకూర్చడం ఇదే తొలిసారి.
ఎన్టీఆర్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. కొత్త ఏడాది కానుకగా విడుదల చేసిన ఈ సినిమా టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది.

పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఫెబ్రవరి మొదటి వారంలో సినిమా విడుదల చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *