స్వాతంత్ర్య వేడుకలకు పటిష్ట బందోబస్తు
నవ్యాంద్రప్రదేశ్ లొ మొదటి సారిగ కర్నూల్ లో నిర్వహిస్తున్న రాష్త్రస్థాయి స్వాతంత్ర్య వేడుకలకు పొలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఏపిఎస్పీ పటాలం పరిసర ప్రాంతాలలో రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం వుంది. బందోబస్తు విధుల కోసం 7 జిల్లాల నుంచి 2,500 మంది సిబ్బంది ని రప్పించినట్లు సమచారం. అలాగె 8 మంది ఏ ఎస్పీ లు, 25 మంది డీఎస్పీ లు, 80 మంది సీఐ లు, 200 మంది ఎస్ఐ లు, 15 మంది
మహిళా ఎస్ఐ లు, 315 మంది హెడ్ కానిస్టేబుళ్ళు, 1.050 మంది కానిస్టేబుళ్ళు, 600 మంది ఏఆర్ సిబ్బంది, 130 మంది మహిళా కానిస్టేబుళ్ళు, 400 మంది హోంగార్డ్ లు, 5 ప్లటూన్ల ఏపిఎస్పీ సాయుధ బలగాల సేవలను వినియోగించనున్నరు.