ఒబామా పర్యటనకు గట్టి భద్రత……..

అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటన నేపథ్యంలో పాక్‌కు చెందిన ఉగ్రవాదుల దాడులకు ముందస్తు హెచ్చరిక….
పోలియో చుక్కలు వికటించి చిన్నారి మృతి…..!!

Obama and his wife Michelle smile at reporters as they walk from the White House to an Easter Church service with their daughters in Washingtonగణతంత్ర దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడానికి భారత్‌కు వస్తోన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కోసం దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలు కంచుకోటగా మారనున్నాయి…….

ఇంతవరకు ఏ విదే శీ నేతకూ కల్పించనంత గట్టి భద్రతను ఏర్పాటుచేస్తున్నారు. ఆయన బసచేసే మౌర్య షెరటాన్ హోటల్ వద్ద 300 మంది ఢిల్లీ పోలీసులు ఒబామా రాకకు 72 గంటల ముందే మోహరించనున్నారు. ఒబామా సందర్శించే ప్రాంతాలు, వాటి  పరిసరాల్లో రాకపోకలను నియంత్రిస్తారు. ఈ నెల 27న ఒబామా ఆగ్రాను సందర్శిస్తుండటంతో 26, 27 తేదీల లో యమునా ఎక్స్‌ప్రెస్ మార్గాన్ని మూసివేయాలని యోచిస్తున్నారు.

తాజ్‌మహల్ దగ్గరున్న హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేయనున్నారు. సెంట్రల్ ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఇండియా గేట్ పరిసరాలను జనవరి 24 నుంచి మూసివేస్తారు. హైటెక్ కెమెరాలను అద్దెకు తీసుకోవడానికే రూ. 5 కోట్లు వెచ్చించారు. పరేడ్‌ను వీక్షించే వారికిచ్చే పాస్‌ల సంఖ్యను నియంత్రించనున్నారు. ఢిల్లీలోని ప్రతి జిల్లా నుంచి  400 మంది పోలీసులు భద్రతా విధుల్లో మోహరించనున్నట్లు సమాచారం.

అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటన నేపథ్యంలో పాక్‌కు చెందిన ఉగ్రవాదుల దాడులకు ముందస్తు హెచ్చరిక….
పోలియో చుక్కలు వికటించి చిన్నారి మృతి…..!!

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *