Chandrababu Naidu

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉసేనాపురంలో నిర్వహించే జన్మభూమి- మా ఊరు కార్యక్రమానికి రానున్నారు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉసేనాపురంలో నిర్వహించే జన్మభూమి- మా ఊరు కార్యక్రమానికి రానున్నారు. ఈ సందర్బంగా ఎస్పీ రవిక్రిష్ణ భారీగా పోలీసులను ఏర్పాటు చేశారు. 2 ఎఎస్పీలు, 7డీఎస్పీలు, 25 మంది సీఐలు, 50 మంది ఎస్సైలు, వెయ్యిమంది కానిస్టేబుళ్లను బందోబస్తుగా ఏర్పాటు చేశారు. చంద్రబాబు పర్యటన వివరాలు.. 11.30 గంటలకు ఉసేనాపురం కు చేరుకుంటారు. 11.40 గంటలకు ఉసేనాపురంలోని పశువైద్యశిబిరంలో రైతులకు మందులు అందజేశారు. 11.55 గంటలకు పొలంపిలుస్తోంది లో భాగంగా […]

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోమంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన  చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ప్రజల ఆస్తులు, మహిళల రక్షణకు పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారని దేశం కోసం పోరాడిన జవాన్ల కంటే పోలీసులు గొప్పవాళ్ల అని అన్నారు. పోలీసుల గౌరవాన్ని పెంచేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

కాకినాడ క్షతగాత్రులను పరామర్శించనున్నముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

 తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో బాణసంచా పేలుడు ప్రమాదానికి సంబంధించి దాదాపు 14 మంది చనిపొయినట్లు సమాచారం. అయితే మృతి చెందినవారిలో ఇద్దరిని ఇంకా గుర్తించలేదు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఈ దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు కాకినాడ వస్తున్నారు.