అధికారులందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రథమ లక్ష్యం

garu.jpg1నవ్యాంధ్రప్రదేశ్‌లో సీమ ముఖద్వారమైన కర్నూలును పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తా.‘‘అధికారులందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రథమ లక్ష్యం. పారదర్శకంగా పని చేస్తా.. అధికారులచేత అదేవిధంగా పని చేయిస్తా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతమాత్రం సహించను.’’ అని జిల్లా  కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ తన ముక్కుసూటి తనం స్పష్టం చేశారు

  • జిల్లాలో పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం పంచ్చజెండా ఊపింది. ఓర్వకల్లు మండలంలోని ఓర్వకల్లు, గడివేముల, మిడుతూరు మండలాల పరిధిలో ఇప్పటికే 29,394 ఎకరాల భూమిని గుర్తించాం.
  • ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామ సమీపంలో న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు వెయ్యి ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశాం. కార్యరూపం దాలిస్తే సుమారు 3వేల మందికి ఉపాధి లభిస్తుంది.
  • ప్రభుత్వం సోలార్, పవన్ విద్యుదుత్పత్తికి పెద్దపీట వేస్తోంది. జిల్లాలో ఇందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. పాణ్యం మండలం పిన్నాపురం వద్ద రూ.7వేల కోట్లతో 5వేల ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశాం.
  • ఆస్పరిలోనూ వెయ్యి మెగావాట్ల పవన(విండ్) విద్యుత్ ప్లాంట్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
  • హలహార్వి మండలం గూళ్యంలోని వేదవతి నదిపై జలాశయం నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపుతాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *