“శివ” చిత్రం మళ్లీ రిలీజ్‌ దాదాపు 100 థియేటర్లలో

“శివ” చిత్రం మళ్లీ రిలీజ్‌  దాదాపు 100 థియేటర్లలో Ram Gopal Varma planning to Re-Release Shiva

‘శివ పాతికేళ్ల వేడుకను హైదరా బాద్‌లోని   అన్నపూర్ణ సెవెన్‌  ఎకర్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు  ‘శివ చిత్రంలో  నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ హాజరై అప్పటి తమ అనుభవాలను పంచుకున్నారు. అక్కినేని  నాగార్జున హీరోగా శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ సమర్పణలో యస్‌.యస్‌.క్రియేషన్స్‌ పతాకాలపై రామ్‌గోపా ల్‌వర్మను  దర్శకుడిగా పరిచయం చేస్తూ వెంకట్‌ అక్కినేని, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన చిత్రం ‘శివ. విడుదలై పాతికేళ్లు పూర్తి చేసుకున్న  ఈ చిత్రం  అప్పట్లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ”రామ్‌గోపాల్‌వర్మ సౌండ్‌ ఇంజనీర్‌  కృష్ణంరాజు కుమారుడు. ‘మా అబ్బాయి ఏదో కథ  అనుకున్నాడట. మీకు చెప్తాడు ని కృష్ణంరాజు నాకు చెప్పారు. నేను సరేనన్నాను. అప్పుడు వర్మ నాకు ‘రాత్రి కథ చెప్పాడు. హార్రర్‌ సినిమాలు నాకు చూడడం ఇష్టం లేదు, చెయ్యడం కూడా ఇష్టంలేదు. ఏదైనా కమర్షియల్‌ ఫార్మాట్‌లో ఉండే కథ చెప్పమన్నాను. అప్పుడు ‘శివ కథ చెప్పాడు. అతను కథ చెప్పేటప్పుడు సినిమా పట్ల అతనికి ఉన్న ప్యాషన్‌ నాకు బాగా నచ్చింది. ‘శివ అనేది ఒక మూమెంట్‌, ఒక లైఫ్‌. . అప్పటివరకు సినిమా అంటే ఆరు పాటలు, అయిదు ఫైట్లు అనే సంప్రదాయానికి స్వస్తిపలికి తెలుగు ప్రేక్షకులకు ‘శివ ఓ కొత్త సినిమాని పరిచయం చేసింది. అని అందరూ తమ అనుభవాలను తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *