రజనీకాంత్ రియల్ లైఫ్ పాత్రను ఆయన అల్లుడు ధనుష్ రీల్ పై….

ఈ నెల 23న వరుణ్ తో త్రిష ఎంగేజిమెంట్
The celebrations of India’s 66th Republic Photo Gallery…….

Shamithab-Movie-Stillరజనీకాంత్ రియల్ లైఫ్ పాత్రను ఆయన అల్లుడు ధనుష్ రీల్ పై….

సినిమాల్లోకి రాకముందు రజనీకాంత్ బస్ కండక్టర్ గా చేసిన విషయం తెలిసిందే. ఆ లైఫ్ ని రజనీ ఎప్పటికీ మర్చిపోరు. అందుకే సూపర్ స్టార్ అయినా కామన్ మేన్ ఉన్నట్లుగానే ఉంటారు రజనీ. ఇప్పుడాయన రియల్ లైఫ్ పాత్రను ఆయన అల్లుడు ధనుష్ రీల్ పై పోషించాడు. ఆ విషయంలోకి వస్తే..

రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను ధనుష్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తమిళ పరిశ్రమలో మంచి మాస్ హీరోగా కొనసాగుతున్న ధనుష్ ‘రాంజ నా’ ద్వారా హిందీలో కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇతగాడు నటించిన హిందీ చిత్రం ‘షమితాబ్’ విడుదలకు సిద్ధమవుతోంది. అమితాబ్ బచ్చన్, అక్షరా హాసన్ కూడా నటించిన ఈ చిత్రానికి బాల్కీ దర్శకత్వం వహించారు. ఇందులో ధనుష్ బస్ కండక్టర్ పాత్రను చేశాడు. తన మామగారి నిజజీవిత పాత్రను చేసినందుకు ఈ అల్లుడు ఆనందపడిపోతున్నాడట. క్రేజ్ కోసం ధనుష్ తో రజనీకాంత్ రియల్ లైఫ్ కారెక్టర్ చేయించలేదనీ, ఈ కథకు ఈ పాత్రే యాప్ట్ అని దర్శకుడు బాల్కీ స్పష్టం చేశారు.

ఈ నెల 23న వరుణ్ తో త్రిష ఎంగేజిమెంట్
The celebrations of India’s 66th Republic Photo Gallery…….

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *