Dhanush

మరో బాలీవుడ్ చిత్రానికి సంతకం చేసిన సౌత్ ఇండియన్ బ్రూస్ లీ

జాతీయ అవార్డు సాధించిన నటుడు ధనుష్ ప్రస్తుతం బాలీవుడ్ లో తన క్రేజ్ ని పెంచుకునే పనిలో వున్నాడు. హిందీలో రెండు మంచి చిత్రాలులో నటించి పేరు తెచ్చుకున్న ఈ సౌత్ ఇండియన్ బ్రూస్ లీ సమాచారం ప్రకారం మూడవ సినిమాను అంగీకరించినట్టు తెలుస్తుంది. ధనుష్ తో గతంలో ‘రాంఝానా’ తెరకెక్కించిన ఆనంద్ ఎల్ రాయ్ తో మరోసారి ప్రేమకధను తెరకెక్కించనున్నాడు. డిసెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది.

రజనీకాంత్ రియల్ లైఫ్ పాత్రను ఆయన అల్లుడు ధనుష్ రీల్ పై….

రజనీకాంత్ రియల్ లైఫ్ పాత్రను ఆయన అల్లుడు ధనుష్ రీల్ పై…. సినిమాల్లోకి రాకముందు రజనీకాంత్ బస్ కండక్టర్ గా చేసిన విషయం తెలిసిందే. ఆ లైఫ్ ని రజనీ ఎప్పటికీ మర్చిపోరు. అందుకే సూపర్ స్టార్ అయినా కామన్ మేన్ ఉన్నట్లుగానే ఉంటారు రజనీ. ఇప్పుడాయన రియల్ లైఫ్ పాత్రను ఆయన అల్లుడు ధనుష్ రీల్ పై పోషించాడు. ఆ విషయంలోకి వస్తే.. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను ధనుష్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తమిళ […]

యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌ రెండో కూతురు అక్షరాహాసన్‌ పిల్లి కళ్లతో అందరిని మాయ…..

అక్షరాహాసన్‌ పిల్లి కళ్లతోనే సగంమందిని పడేసింది ఒక్కసారిగా మెరిసిన బ్యూటీ చూట్టునే కెమెరాలన్నీ ఆమె వైపే  ఉన్నాయట. యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌ కూతుళ్లలో శృతిహాసన్‌కు పెద్దగా పరిచయం అక్కర్లేదు. కమల్‌ రెండో కూతురు అక్షరాహాసన్‌ సౌత్‌సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌, బిగ్‌బీ అమితాబ్‌ నటించిన ‘షమితాబ్‌’ సినిమాలో నటించింది.ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో భాగంగా అక్షరా పొట్టి డ్రెస్‌తో సెక్సీ లేడీగా కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె పిల్లి కళ్లతోనే సగంమందిని పడేసింది. ఈ కార్యక్రమంలో ఒక్కసారిగా మెరిసిన బ్యూటీ చూట్టునే […]

మణిరత్నం దర్శకత్వంలో ధనుష్‌కి నటించే ఛాన్స్

మణిరత్నం దర్శకత్వంలో ధనుష్‌కి నటించే ఛాన్స్…  మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి హీరోలు, హీరోయిన్లు ఉవ్విళ్ళూరుతుంటారు. వాళ్లల్లో తమిళ హీరో ధనుష్ కూడా వున్నాడు. అతని కోరిక త్వరలోనే తీరుతోంది. మణిరత్నం దర్శకత్వంలో నటించే ఛాన్స్ ధనుష్‌కి తాజాగా వచ్చినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం తమిళంలో తాను చేస్తున్న చిత్రం పూర్తవగానే మణిరత్నం హిందీలో స్ట్రెయిట్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో హీరో పాత్ర కోసం ధనుష్‌ను సంప్రదించినట్టు తెలిసింది.

‘వేలై ఇల్లా పట్టదారి’- ‘రఘువరన్ బీటెక్’ పేరుతో తెలుగులోకి అనువాదం….

‘వేలై ఇల్లా పట్టదారి’. ధనుష్, అమలాపాల్ జంటగా ఆర్. వేల్‌రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం అనువాద హక్కులను శ్రీస్రవంతి మూవీస్ అధినేత రవికిశోర్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా రవికిశోర్ మాట్లాడుతూ -‘‘తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఉన్న కథ కావడంతో ఇక్కడ విడుదల చేస్తున్నాం. రఘువరన్ చాలా మంచి కుర్రాడు. బుద్ధిగా చదువుకుంటాడు. బీటెక్ కూడా పూర్తి చేస్తాడు. మంచి ఉద్యోగం దొరికితే హ్యాపీగా సెటిలైపోవచ్చు. కానీ, అనుకున్నామని అన్నీ జరుగుతాయా? […]