విక్రమ్ కొత్త ప్రాజెక్ట్ సగానికి పైగా షూటింగ్ పూర్తయింది!
ప్రస్తుతం విక్రమ్ ఐ ప్రమోషన్‌లో బిజీగా వున్నారు. కాగా, తర్వాత చిత్రం ఇంకా ఏమీ అనుకోలేదని ఇటీవలే హైదరాబాద్‌లో ప్రకటించారు. కానీ కొత్త ప్రాజెక్ట్‌లో నటించబోతున్నాడు. 10 ఎన్‌రాద్‌కుల్లా అనే తమిళ చిత్రం కోసం కసరత్తు చేస్తున్నాడు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ఈ చిత్రం ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. రెండు పాటలు చిత్రీకరించాల్సి వుంది. ఈ చిత్రం పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ చిన్నపాటి యాక్షన్‌తో రూపొందనున్నట్లు తెలుస్తోంది.
కురూపి పాత్ర కోసం పన్ను ఊడగొట్టుకున్నా… విక్రమ్
విక్రమ్ అనగానే శివపుత్రుడు, అపరిచితుడు వంటి భిన్నమైన పాత్రలు పోషించిన నటుడు ఆయనలో గుర్తుకువస్తాడు. చేసింది తక్కువ చిత్రాలైనా అన్నీ కొత్తకోణంలోనే వుంటాయి. బాలీవుడ్‌లోనూ ‘రావణ్’తో ముందుకు వచ్చిన విక్రమ్ ఈసారి తమిళం, మలయాళం, హిందీతో కలిసి మూడు భాషల్లోనూ చేసిన చిత్రం ‘ఐ’. తెలుగులో అదే పేరుతో డబ్ చేయబడింది. చిత్రం ప్రమోషన్‌లో భాగంగా విక్రమ్ సోమవారం నాడు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “బరువు పెరగడం, తగ్గడంతో పాటు… ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి […]
‘ఐ’ అమెరికాలో మాత్రమే 450థియేటర్లలో విడుదలవుతూ రికార్డు….
‘ఐ‘ అమెరికాలో మాత్రమే 450థియేటర్లలో విడుదలవుతూ రికార్డు…. భ్రాంహాండాల రూపకర్త శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన విక్రమ్ చిత్రం ‘ఐ‘. సంక్రాంతి సందర్భంగా బుధవారం విశ్వ వ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ చిత్రం కేవలం అమెరికాలో మాత్రమే 450థియేటర్లలో విడుదలవుతూ రికార్డు సృష్టించనుంది. ఇప్పటి వరకూఅమెరికాలో బాలీవుడ్ సినిమా కూడా ఈ స్థాయిలో విడుదల కాకపోవడం గమనార్హం. కాగా అమెరికాలో ‘ఐ‘ తెలుగు, తమిళం, హిందీ అంటూ మూడు భాషల్లో విడుదల కానుంది. భారత […]
శంకర్ – విక్రమ్‌ల ప్రతిష్టాత్మక చిత్రం ‘ఐ’ విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే
శంకర్ – విక్రమ్‌ల ప్రతిష్టాత్మక చిత్రం ‘ఐ’ విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే భారతీయ సినిమా మొత్తం ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న శంకర్ – విక్రమ్‌ల ప్రతిష్టాత్మక చిత్రం ‘ఐ’ విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. ఈ చిత్రాన్ని నిర్మించిన ఆస్కార్ రవిచంద్రన్ తమ వద్ద తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేవరకు ‘ఐ’ విడుదల చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ఓ తమిళ నిర్మాణ సంస్థ కోర్టుని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల […]
విక్రమ్ ‘ఐ’ రన్ టైం బాగా ఎక్కువ
యావత్ సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఐ’ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ‘ఐ’ సినిమా రన్ టైం 3 గంటల 8 నిమిషాలు(188 నిమిషాలు) అని సమాచారం. ప్రస్తుతం ఈ రన్ టైం ఉన్న సినిమాని సెన్సార్ కి పంపుతున్నట్లు తెలిసిందే. సెన్సార్ పూర్తైన తర్వాత ఇందులో ఒక 8 నిమిషాలు కట్ చేసి టోటల్ గా 3 గంటల సినిమాని రిలీజ్ చేసేలా ఈ చిత్ర […]
శంకర్ ‘ఐ’ విడుదల తేదీ హమ్మయ్య!
విక్రమ్, శంకర్ ల భారీ చిత్రం ‘ఐ’ . ఈ చిత్రం రిలిజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతికి రాదంటూ వార్తలు వచ్చాయి. దాంతో అభిమానులు కంగారుపడ్డారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ తేదీ ని ప్రకటించారు. జనవరి 9న ఈ చిత్రం విడుదల చేస్తామని తేదీని ఖరారు చేసినట్లు తమిళ వర్గాల సమాచారం. ఇప్పటికే మృగరాజు వేషంలో ఉన్న ప్రచార చిత్రం అందరినీ ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచుతోంది.
ఐ ’ పాటల్ని డిసెంబర్ 15న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు…
శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ ఐ ’ పాటల్ని డిసెంబర్ 15న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు ఈ ఆడియో వేడుకకు చైనీస్ సూపర్ స్టార్ జాకీచాన్, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు ముఖ్య అతిధిలుగా వస్తున్నట్లు ఫిలింనగర్ టాక్.
విక్రమ్ ‘ఐ’ కథ లీకైంది!!!
‘ఐ’ చిత్రం కథ బయిటకు వచ్చి తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో , తమిళ మీడియాలో నలుగుతోంది. లీకైందంటూ చెప్పబడుతున్న ఈ కథ ఎంతవరకూ నిజమో కాదో అన్నది రిలీజయ్యేదాక తెలియదు. కథేమిటంటే… ప్రముఖ కండల వీరుడు, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రపంచ మేటి కండల వీరుడు కావాలనేది లింగేశన్ అనే యువకుడి కల. దీని కోసం ఎంతో కష్టపడతాడు. తన కల నెరవేరుతుందన్న సమయంలో అనుకోకుండా ఓ అడ్డంకి ఎదురవుతుంది. అదేంటి.. […]
‘ఐ’ చిత్రానికి అన్ని భాషల్లో విక్రమ్ నే డబ్బింగ్ చెప్పనున్నారు.
విక్రమ్ కథానాయకుడిగా రూపొందిస్తున్న ‘ఐ’ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తికాకపోవడంతో విడుదల వచ్చేనెలకు వాయిదా పడింది. త్వరలో తెలుగు ఆడియో విడుదల కార్యక్రమానికి హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించనున్నామని, జాకీచాన్ కూడా రానున్నారని, ఈ ప్రిమియర్ షోను సింగపూర్‌లో ప్రదర్శించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 20వేల థియేటర్లలో విడుదల చేయనున్నారు.