దోమలు.. రక్తం పీలుస్తూ కర్నూలు నగర వాసులకు నిదుర లేకుండా చేయడమే కాక.. భారీగా ఖర్చు పెట్టిస్తున్నాయి
దోమలు.. రక్తం పీలుస్తూ కర్నూలు నగర వాసులకు నిదుర లేకుండా చేయడమే కాక.. భారీగా ఖర్చు పెట్టిస్తున్నాయి. కర్నూలు నగరంలోని ప్రజలు దోమల నుంచి రక్షించుకోవడానికి, దోమల బారిన పడి జ్వరాలు నయం చేసుకునేందుకు వైద్యం కోసం ప్రతి నెలా రూ. కోటికి పైగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా దోమల బారి నుంచి తప్పించుకోవడానికి 99 శాతం మంది ప్రజలు మస్కిటో కాయిల్స్, మస్కిటో లిక్విడ్స్, ఇతర స్ప్రేలను వాడుతున్నారు.