కురూపి పాత్ర కోసం పన్ను ఊడగొట్టుకున్నా… విక్రమ్‌

త్వరలో పెళ్లి కొడుకు కాబొతున్న సంగీత దర్శకుడు దేవిశ్రీ……..
బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌, ధనుష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘షమితాబ్‌’ ఆడియో వేడుక ……

Vikram-21.01విక్రమ్‌ అనగానే శివపుత్రుడు, అపరిచితుడు వంటి భిన్నమైన పాత్రలు పోషించిన నటుడు ఆయనలో గుర్తుకువస్తాడు. చేసింది తక్కువ చిత్రాలైనా అన్నీ కొత్తకోణంలోనే వుంటాయి. బాలీవుడ్‌లోనూ ‘రావణ్‌’తో ముందుకు వచ్చిన విక్రమ్‌ ఈసారి తమిళం, మలయాళం, హిందీతో కలిసి మూడు భాషల్లోనూ చేసిన చిత్రం ‘ఐ’. తెలుగులో అదే పేరుతో డబ్‌ చేయబడింది. చిత్రం ప్రమోషన్‌లో భాగంగా విక్రమ్‌ సోమవారం నాడు హైదరాబాద్‌ వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  “బరువు పెరగడం, తగ్గడంతో పాటు… ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. ఉడకపెట్టిన కాయగూరలు తినాలి. ఆఫ్‌ బాయిల్‌ ఎగ్‌ తినాలి. కొద్దిగా అన్నం.. జ్యూస్‌ అంతే. ఒక్కోసారి సాయంత్రం 5 గంటల తర్వాత బాడీ అంతా ఏదోలా అనిపించేది. పిచ్చెక్కినట్లు వుండేది. దానికి ఓ డాక్టర్‌ కూడా పర్యవేక్షణ చేసేవారు.  ఫిజియోథెరపిస్ట్‌ కూడా వుండేవాడు. అన్నిటికంటే బాడీ బిల్డర్‌గా కొంచెం కష్టపడ్డాను. అందగాడి గెటప్‌కు మామూలుగా వున్నప్పుడే తీశారు. మూడో గెటప్‌ .. కురూపిగా వున్న పాత్రకోసం… చాలా బరువుతగ్గాను. పన్ను కూడా పోగొట్టుకున్నాను. చాలా పీలగా మారాను. ఇదే చాలా కష్టమైన పాత్ర.”

త్వరలో పెళ్లి కొడుకు కాబొతున్న సంగీత దర్శకుడు దేవిశ్రీ……..
బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌, ధనుష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘షమితాబ్‌’ ఆడియో వేడుక ……

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *