Ilayadalapathi vijay

హాలీవుడ్‌లో రూపొందే యూరోపియన్ సినిమాలో తమిళంలో స్టార్ హీరో విజయ్‌……

హాలీవుడ్‌లో రూపొందే యూరోపియన్ సినిమాలో తమిళంలో స్టార్ హీరో విజయ్‌…… హాలీవుడ్‌లో రూపొందే యూరోపియన్ సినిమాలో నటించాల్సిందిగా నిర్మాతలు తమిళంలో స్టార్ హీరో విజయ్‌ని కోరారట. ఇండియన్‌కు సంబంధించిన వ్యక్తి కథతో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అందులో ఇండియన్ స్టార్ నటిస్తే బాగుంటుందని ఆలోచించి దానికి విజయ్ అయితే బెటర్ అని ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. విజయ్‌కు ఓ గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ విషయంపై ఇంకా విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే వివరాలు తెలియజేస్తాడని విజయ్ సన్నిహిత వర్గాలు […]

విజయ్ చిత్రయూనిట్‌కు ఊహించని బహుమతి…..

విజయ్ చిత్రయూనిట్‌కు ఊహించని బహుమతి….. శింబుదేవన్ దర్శకత్వం లో విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘పులి’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తలకోన అడవుల్లో జరుగుతోంది.  అక్కడ చిత్రీకరించిన సన్నివేశాలు బాగా రావడంతో విజయ్ చిత్రయూనిట్‌కు ఊహించని బహుమతి ఇచ్చారు. అందరికీ ఒక్కో బంగారు నాణెం అందించారు. దాంతో వాళ్లందరూ తెగ సంబరపడిపోయారు.  

అతిలోక సుందరి శ్రీదేవి కి…నెలరోజులకు రూ.5 కోట్లు పారితోషికం అంటే ….

 శింబుదేవన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ గరుడ ’ అనే చిత్రం లో శ్రీదేవి మహారాణి పాత్ర పోషిస్తుందని టాక్‌. ఈ పాత్ర కోసం 30 రోజుల షెడ్యూల్‌కి అతిలోక సుందరి శ్రీదేవి అక్షరాల 5 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. . ఈ చిత్రంలో విజయ్‌, కన్నడ హీరో సుదీప్‌ లు నటిస్తున్నారు. విజయ్‌ సరసన శృతిహాసన్‌, సుదీప్‌ సరసన హన్సికలు నటిస్తున్నారు.

“మేము సైతం”లో భాగంగా కోలీవుడ్ నటుడు విజయ్ రూ. 5 లక్షలు…

హుద్‌హుద్ బాధితులను ఆదుకునేందుకు నిన్న టాలీవుడ్ ఇండస్ట్రీ “మేము సైతం” అంటూ పలు కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విరాళాలను సేకరించింది. . ఈ నేపధ్యంలో మేము సైతం కార్యక్రమంలో భాగంగా కోలీవుడ్ నటుడు విజయ్ రూ. 5 లక్షలు ఇచ్చారు.

మరుగుజ్జు పాత్రలో ఇళయదళపతి విజయ్

  ఇళయదళపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “మారిశన్”. ఈ  చిత్రంలో ఆయనకు జంటగా శ్రుతిహాసన్, హన్సిక నటిస్తున్నారు. ముఖ్యమైన పాత్రలో అతిలోక సుందరి శ్రీదేవి, ప్రతి నాయకుడిగా సుదీప్ నటిస్తున్నారు. యువ దర్శకుడు శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.