పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో చెప్పడానికి ఇంతకంటే రుజువేముంది

కమల్‌హాసన్‌, తమిళ సూపర్‌ స్టార్‌ సూర్య, కార్తీలు కూడా మేముసైతం కార్యక్రమానికి హాజరవుతున్నారు.
చాలా సంవత్సరాల తర్వాత మనసారా నవ్వుకున్న సందర్భమిది…చిరంజీవి

Pawan-Kalyan--Po---29.11-ఆయన గెస్ట్ రోల్ చేసిన ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో హల్ చల్ చేస్తోంది. నిన్న సాయంత్రం విడుదలైన ఫస్ట్ లుక్‌ ట్విట్టర్లో వరల్డ్ వైడ్ ట్రెండింగ్స్ లో నెంబర్ వన్‌గా నిలవడం విశేషం. కొన్ని గంటల పాటు ‘గోపాల గోపాల’ అగ్రస్థానంలో కొనసాగింది. విశేషమేంటంటే.. పవన్ ఫ్యాన్ అయిన నితిన్‌కు కూడా ట్విట్టర్లో మంచి రెస్పాన్సే వచ్చింది. అతడి సినిమా ‘చిన్నదాన నీకోసం’ టాప్ ట్రెండ్స్‌లో మూడో స్థానంలో కొనసాగింది. పవర్ స్టార్ ఫ్యాన్ కూడా ఎంత పవర్‌ఫుల్లో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఇక గోపాల గోపాల ఫస్ట్ లుక్ విషయానికొస్తే సెలబ్రెటీస్ అందరూ లుక్ అదుర్స్ అని కితాబిచ్చారు. పోస్టర్ కంటే కూడా మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్టర్‌పై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా స్పందించింది. ‘పర్‌ఫెక్ట్ పోస్టర్ ఫర్ పర్ ఫెక్ట్ పర్సన్’ అంటూ తన అభిప్రాయం చెప్పింది. నిర్మలమైన, దివ్యమైన లుక్ ఆయనకు మాత్రమే సాధ్యం అంటూ పవన్‌పై పొగడ్తలు గుప్పించింది రేణు. ‘‘ఇట్స్ కాల్ పవర్‌ఫుల్ లుక్’’ అంటూ సింపుల్‌గా తన అభిప్రాయం చెప్పాడు రామ్‌గోపాల వర్మ. ‘‘విక్టోరియస్ లుక్. దేవుడు మనిషైతే ఇలాగే ఉంటాడేమో’’ అని నిఖిల్ రెస్పాండయ్యాడు. ఇంకా చాలామంది ఫస్ట్ లుక్ గురించి తమ అభిప్రాయాన్ని ట్విట్టర్లో రాసుకున్నారు.

కమల్‌హాసన్‌, తమిళ సూపర్‌ స్టార్‌ సూర్య, కార్తీలు కూడా మేముసైతం కార్యక్రమానికి హాజరవుతున్నారు.
చాలా సంవత్సరాల తర్వాత మనసారా నవ్వుకున్న సందర్భమిది…చిరంజీవి

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *