Gopala Gopala

గోపాల గోపాల సినిమా…హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు…

గోపాల గోపాల సినిమా …హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు… వెంకటేష్, పవన్ కళ్యాణ్  కలిసి నటించిన ‘గోపాల గోపాల’ చిత్రంపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో రఘునాథరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. గోపాల గోపాల సినిమా …హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ అతను తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఒకసారి ఊహించుకోండి చిరు, బాలయ్య, నాగ్, వెంకీ లు కలిసి ‘అవెంజర్స్’ మూవీ రేంజ్ లో ఒకే పోస్టర్ పై ఉంటే ఎలా ఉంటుందో..

ఒకసారి ఊహించుకోండి చిరు, బాలయ్య, నాగ్, వెంకీ లు కలిసి ‘అవెంజర్స్’ మూవీ రేంజ్ లో ఒకే పోస్టర్ పై ఉంటే ఎలా ఉంటుందో.. స్టార్డం తో సంబంధం లేకుద్నా అన్ని రకాల సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేష్. వెంకటేష్ తన కెరీర్లో ఎన్నో రకాల ప్రయోగాత్మక సినిమాలు చేసారు. టాలీవుడ్ లో ఎప్పుడో ఆగిపోయిన మల్టీ స్టారర్ ట్రెండ్ ని ఆయనే తిరిగి పునఃప్రారంభించారు.  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె […]

Gopala Gopala is top trending video on Youtube

Power Star Pawan Kalyan and Victory Venkatesh have taken social media by storm with their film ‘Gopala Gopala’ . The movie’s theatrical trailer was released a few days ago at the audio launch function and it started trending on Youtube almost instantly. It is now in first position in India’s Top Trending videos on Youtube, […]

హాస్పటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అవ్వగానే నేనే వ్యక్తిగతంగా కలుస్తా -పవన్ కళ్యాణ్

  హాస్పటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అవ్వగానే నేనే వ్యక్తిగతంగా కలుస్తా -పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ టికెట్ల కోసం గొడవపడి పవన్ కల్యాన్ అభిమాని కొందరు దుండగులు కరుణ శ్రీనివాస్‌పై దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు…దాడి జరుగుతున్నప్పుడు పవన్ కల్యాణ్ అభిమానులు సెల్‌ఫోన్‌లో తీసిన ఫొటోలను సేకరించారు. గోపాల గోపాల’  సినిమా ఆడియో  కార్యక్రమం సందర్భంగా  శిల్పకళా వేదిక ఆవరణలో ఆదివారం జరిగిన సంఘటనపై హీరో […]

విక్టరీ వెంకటేష్‌, పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కలిసి నటిస్తున్న”గోపాల గోపాల” పోస్టర్లు విడుదల

విక్టరీ వెంకటేష్‌, పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ సినిమా “గోపాల గోపాల” చిత్రానికి సంబంధించి పోస్టర్లను  తాజాగా న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం విడుదల చేశారు. ఈ లుక్‌లో పంచకళ్యాణి రథంపై కృష్ణార్జునలను తలపించేలా ఉన్న ఈ పోస్టర్‌ మరింత ఆకట్టుకుంటోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల పై అటు విక్టరీ అభిమానులతో పాటు పవర్‌స్టార్‌ అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ‘

‘గోపాల గోపాల’ చిత్రానికి సంబంధించి స్టిల్స్‌….

డిసెంబర్‌ 13 విక్టరీ వెంకటేష్‌ పుట్టిన రోజు సందర్భంగా వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌తో కలిసి నటించిన ‘గోపాల గోపాల’ చిత్రానికి సంబంధించి స్టిల్స్‌ను విడుదలచేశారు.. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌కు మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ మల్టీస్టారర్‌ ఫిల్మ్‌ పై మరింత అంచనాలు పెరిగాయి. ఇప్పుడు  వెంకటేష్‌ బర్త్‌డే్ కానుకగా ఈ చిత్రంలోని వెంకటేష్‌ స్టిల్స్‌ను విడుదల చేయడం వెంకీ అభిమానులకు ఆసక్తిని  కలిగిస్తోంది.

ప్రస్తుతం పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో పవన్ కల్యాణ్ …

ప్రస్తుతం పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో పవన్ కల్యాణ్  బస చేశారు. ఆయన ‘గోపాల గోపాల’ సినిమా షూటింగు కోసం కాశీ పట్టణంలో వున్నాడు. ఆయనపై ఓ ప్రత్యేకమైన పాటను అక్కడ చిత్రీకరిస్తున్నారు. వెంకటేష్, పవన్ కలసి నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో చెప్పడానికి ఇంతకంటే రుజువేముంది

ఆయన గెస్ట్ రోల్ చేసిన ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో హల్ చల్ చేస్తోంది. నిన్న సాయంత్రం విడుదలైన ఫస్ట్ లుక్‌ ట్విట్టర్లో వరల్డ్ వైడ్ ట్రెండింగ్స్ లో నెంబర్ వన్‌గా నిలవడం విశేషం. కొన్ని గంటల పాటు ‘గోపాల గోపాల’ అగ్రస్థానంలో కొనసాగింది. విశేషమేంటంటే.. పవన్ ఫ్యాన్ అయిన నితిన్‌కు కూడా ట్విట్టర్లో మంచి రెస్పాన్సే వచ్చింది. అతడి సినిమా ‘చిన్నదాన నీకోసం’ టాప్ ట్రెండ్స్‌లో మూడో స్థానంలో కొనసాగింది. […]

తెలుగు పరిశ్రమలో అందరికీ ఆసక్తిగొలుపుతున్న చిత్రం ‘గోపాల గోపాల’ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది

  ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో అందరికీ ఆసక్తిగొలుపుతున్న చిత్రం ‘గోపాల గోపాల’. పవన్‌కళ్యాణ్ కృష్ణుడిగా, వెంకటేష్ భక్తుడిగా ఈ చిత్రం లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కిశోర్ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. . అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న చిత్రంలోని పాటలను త్వరలోనే విడుదల చేయడానికి , చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరిలో అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు

పవన్ ఎంట్రీ షాట్ ఖర్చు రూ. 50 లక్షలు… ‘గోపాల గోపాల’

గోపాల గోపాల చిత్రంలో విక్టరీ వెంకటేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ కోసం సుమారు 50 లక్షలతో విజువల్ వండర్‌ని క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విజువల్ ను పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై కన్పించేటపుడు ఉపయోగిస్తారని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.