గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు

Happy Birth Day to Shashank
హుదూద్ తుఫాన్ బాధితుల సహాయార్థం హీరోయిన్ సమంత తన వంతు సాయం గా 10 లక్షల రూపాయల చెక్కు

Modi-Obama-22.11అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చే ఏడాది భారత గణతంత్ర వేడుకలకు హాజరుకానున్నారు. అమెరికా అధ్యక్షుడు మన దేశ గణతంత్ర వేడుకలకు హాజరుకానుండటం ఇదే తొలిసారి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పంపిన ఆహ్వానాన్ని ఒబామా శుక్రవారం అంగీకరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు 2015 జనవరిలో ఒబామా భారత్‌లో పర్యటించి గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారని అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం సమాచార కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ తెలిపారు. భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనే గౌరవం అమెరికా అధ్యక్షుడికి లభించడం ఇదే తొలిసారి అని, అమెరికా-భారత్ మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు బరాక్ ఒబామా ఈ పర్యటనలో మోడీతో పాటు భారత అధికారులతో సమావేశమవుతారని ఎర్నెస్ట్ వివరించారు.

Happy Birth Day to Shashank
హుదూద్ తుఫాన్ బాధితుల సహాయార్థం హీరోయిన్ సమంత తన వంతు సాయం గా 10 లక్షల రూపాయల చెక్కు

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *