‘గోవిందుడు అందరివాడేలే’

ఎండల తీవ్రత పెరగడంతో పంటలు ఎండుముఖం పట్టాయి
కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయన సర్వశిక్ష అభియాన్ వయోజన విద్యాశాఖ అధికారులతో సమీక్ష

Ram-Charan-Teja-latest1 ఇందులో నా పేరు గోవిందుడు కాదు, అభిరామ్‌. నేను అందరివాడినని చెప్పడానికి ‘గోవిందుడు అందరివాడేలే’ అనిపెట్టాం. లండన్‌లో పుట్టి పెరిగే పాత్ర నాది. అయినా మన సంస్కృతిని మర్చిపోని పాత్ర. హైదరాబాద్‌లో పుట్టి పెరిగినవాడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు అభిరామ్‌. ఇది ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా. చాలా రోజుల నుంచి ఫ్యామిలీ సినిమా చేద్దామని చూస్తున్నా. ‘మగధీర’ తర్వాత నేను చేయాల్సిన సినిమా ఇది. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు చేయలేకపోయాం. ‘‘ కాలంలో ఎస్వీ రంగారావు గారు ఎలా ఉండేవారో, కాలానికి ప్రకాశ్రాజ్అలా ఉన్నారనేది నో డౌట్‌. ఆయనను మనం సరిగా వాడుకోలేదు. ఆయన నటనా సామర్థ్యం ఏమిటో సినిమాతో తెలుస్తుంది’’ అని చెప్పారు రామ్చరణ్‌. మణిరత్నం గురించి మట్లాడుతూ మణిరత్నంగారు కూడా కథ చెప్పారు. అయితే మా ఇద్దరి కాంబినేషన్‌కు అది కరెక్ట్‌ సబ్జెక్ట్‌ కాదనిపించింది.  కృష్ణవంశీ గురించి మట్లాడుతూ ఆయన చేసిన సినిమాలు ఫెయిలయ్యాయేమో కానీ, డైరెక్టర్‌గా ఆయన ఫెయిలవలేదు. ‘పైసా’ కానీ, ‘డేంజర్‌’ కానీ.. ఆయన ఎంచుకున్న కాన్సెప్ట్‌ ఫెయిలయ్యిందంతే. ఓ కథను నమ్ముకున్నప్పుడు రాజీపడకుండా తీసే వంశీ వంటి డైరెక్టరే నాకు కావాలి. నటీనటుల నుంచి నటనను రాబట్టే విషయంలో నెంబర్‌వన్‌ డైరెక్టర్‌ ఆయన. సినిమాలో నాకు బాగా నచ్చింది నా కేరక్టర్‌. దాన్ని తీర్చిదిద్దిన విధానం కానీ, నటునిగా నాలో కొత్త కొత్త కోణాలను కృష్ణవంశీ ఆవిష్కరించిన తీరు కానీ బాగా నచ్చాయి.

ఎండల తీవ్రత పెరగడంతో పంటలు ఎండుముఖం పట్టాయి
కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయన సర్వశిక్ష అభియాన్ వయోజన విద్యాశాఖ అధికారులతో సమీక్ష

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *