‘కరివేపాకే కదా’ అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పదు

భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
భారతదేశంలో మొట్ట మొదటి మహిళా ముఖ్య మంత్రి ఎవరు?

benefits-of-curry-leaf‘కరివేపాకే కదా’ అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పదు. కూరైనా, సాంబారు అయినా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచే డిఫరెంట్‌గా ఉంటుంది.

 

కూరకి అంత రుచిని ఇచ్చిన కరివేపాకును మాత్రమే ఏరి పారేస్తారు. కరివేపాకు మంచిదని అందరికీ తెలుసు. కానీ, ఇష్టంలేకో లేక అలవాటులో పొరపాటో… కరివేపాకుని తినకపోవడానికి సవాలక్ష కారణాలు. శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ, బి విటమిన్, కెరోటిన్  కరివేపాకులో పుష్కలంగా ఉండటమే కాదు.. తాజా కరివేపాకు నుంచి ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, పీచు పదార్ధాలు, ఖనిజ లవణాలు, క్యాలరీలు కూడా లభిస్తాయి.

  1. ఆరోగ్యానికే కాదు.. సౌందర్యానికీ కరివేపాకుని బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకు వేసి కాచిన నూనెని తలకి మర్ధన చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. పెరుగుతాయి కూడా. అంతేనా… జుట్టు తెల్లబడటం తగ్గి, కురులు నల్లదనాన్ని సంతరించుకుంటాయి.
  2. పెద్దలకు మాత్రమే కాదు పిల్లల్లో ఆకలి మందగిస్తే చక్కగా స్పూన్ నెయ్యి వేసి కరివేపాకు పొడి కలిపి రోజు మొదటగా రెండు ముద్దలు పెడితే చాలు. ఆకలి పెరుగుతుంది. అజీర్తి తగ్గుతుంది కూడా. కరివేపాకు పొడి అంటే ఒట్టి కరివేపాకే కాదు.. మెంతులు, మిరియాలు కూడా కలపాలి.
  3. ప్రతిరోజూ ఉదయమే పది కరివేపాకుల చొప్పున మూడు నెలలపాటు తింటే స్థూలకాయం, అలాగే రక్తంలో చక్కెర శాతం కూడా తగ్గుతాయని ఆయుర్వేద వైద్యులు అంటుంటారు.

 

 

భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
భారతదేశంలో మొట్ట మొదటి మహిళా ముఖ్య మంత్రి ఎవరు?

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *