modi

ఆవేదన వ్యక్తం చేసిన నరేంద్ర మోదీ

గుజరాత్లోని రాజ్కోట్లో తన విగ్రహాన్ని ప్రతిష్టించడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఆలయం నిర్మించడం  వ్యక్తిగతంగా చాలా బాధించిందని మోదీ అన్నారు. ఇదా మన సంస్కృతి మనకు నేర్పిందంటూ , మీకు తీరిక, సమయం ఉంటే దయచేసి.. మన దేశాన్ని పరిశుభ్రంగా మార్చాలన్న కలను నెరవేర్చడానికి స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం చేపట్టాలని  మోదీ తన మద్దతుదారులకు ట్వీట్టర్లో సలహా ఇచ్చారు. ఇటువంటివి మళ్లీ పునరావృతం చేయరాదంటూ సూచించారు.

ప్రధాని మోడీకి గుజరాత్ లో గుడి!

పవిత్ర భారతదేశంలో వీధికో గుడి దర్శనం ఇస్తుంది. మనకు ఉన్న దేవుళ్ళు అంతమంది మరి. కొందరు తమ అభిమాన సినీ తారల కోసం కూడా గుళ్ళు కడుతూ ఉంటారు. అయితే రాజకీయనాయకులకు గుడి కట్టినట్లు మాత్రం చాలా అరుదుగా వింటుంటాం. ఇక ఇప్పుడు తాజాగా కొంతమంది ప్రజలు తమ అభిమాన నాయకుడికి గుడి కట్టి రెండు పూటలా దీపారాధన కూడా చేస్తున్నారట. దేశవ్యాప్తంగా అభిమాన గణం ఉన్న ప్రధాని మోడీకి గుజరాత్ లో ఉన్న ఫాలోయింగే వేరు. […]

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేజ్రీవాల్ కు ఫోన్……

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి ఆమ్ ఆద్మీ పార్టీ విజయభేరీ మోగించడం ఖాయమై పోయింది. దీంతో ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు, సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం ముందు బీజేపీ వెలవెలబోయింది.

ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.850 కోట్ల నిధులు!

అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కరుణ చూపింది. ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద భారీ మొత్తంలో నిధులను మంజూరు చేసింది. ముఖ్యంగా.. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని 7 జిల్లాల అభివృద్ధికి కేంద్ర ఆర్థిక శాఖ 350 కోట్ల రూపాయలు విడుదల చేయాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా 2014-2015 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను పారిశ్రామిక ప్రోత్సాహకాలకు […]

The celebrations of India’s 66th Republic Photo Gallery…….

The celebrations of India’s 66th Republic Photo Gallery

భారత దేశ 66వ గణతంత్ర వేడుకలు……

భారత దేశ 66వ గణతంత్ర వేడుకలు సోమవారం దేశమంతటా ఘనంగా జరిగాయి. రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు ఒకరు ఈ గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకావడం ఇదే ప్రథమం. యూనిఫారం దుస్తుల్లో సైనికుల కవాతు, భారత సైనిక పాటవాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటి చెప్పే శకటాల ప్రదర్శన, సన్నని చినుకులతోపాటు గగనతలం నుంచి హెలికాప్టర్‌లో కురిసిన పూలజల్లులు,వాయిద్య బృందాలు, నృత్య కళా రూపాలు పరేడ్‌కు […]

అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానినరేంద్రమోడీ, గవర్నర్ నరసింహన్ తీవ్ర దిగ్భ్రాంతి

అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానినరేంద్రమోడీ, గవర్నర్ నరసింహన్ తీవ్ర దిగ్భ్రాంతి అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానినరేంద్రమోడీ, గవర్నర్ నరసింహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంతదురదృష్టకరమైన ఘటనగా అభివర్ణించారు. మృతులు కుటుంబాలకుసంతాపం తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలనిఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.  

ప్రధాని మోదీని ‘ఏషియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు వరించింది.

ప్రధాని మోదీని ‘ఏషియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు వరించింది. భారత అభివృద్ధి నాయకత్వం అందించినందుకు ఈ అవార్డు అందిస్తున్నట్లు సింగపూర్‌కు చెందిన ‘ది స్ట్రైట్ టైమ్స్’ దినపత్రిక ప్రకటించింది. ‘మేకిన్ ఇండియా’ పిలుపు దేశాభివృద్ధికి బాటలు వేస్తుందని  పత్రిక సంపాదకుడు చెప్పారు. ప్రధాని పదవికి మోదీ కొత్తయినా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఆస్ట్రేలియా ప్రధాని ఎబాట్‌లతోపాటు పలువురు నేతలను కలిసి  ఆసియాలో తనదైన ముద్ర వేయగలిగారంది.

‘గ్లోబల్ థింకర్స్’ జాబితాలో మోడీ ఫస్ట్

ప్రపంచ అగ్రశ్రేణి విధాన నిర్ణేతల (గ్లోబల్ థింకర్స్) జాబితాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడో స్థానంలో ఉండగా, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మార్కెల్ రెండో స్థానంలో ఉన్నారు. అమెరికన్ ఫారిన్ పాలసీ మ్యాగజైన్ వందమందితో ‘గ్లోబల్ థింకర్స్’ పేరుతో ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో భారత్ నుంచి బీజేపీకి చెందిన మోడీ, అమిత్ షాలు చోటు దక్కించుకున్నారు. మోడీ కేవలం విధాన […]

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పది రోజుల విదేశీ పర్యటన ముగించుకుని గురువారం ఉదయం స్వదేశానికి చేరుకున్నారు.

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పది రోజుల విదేశీ పర్యటన ముగించుకుని గురువారం ఉదయం స్వదేశానికి చేరుకున్నారు. విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌, ప్రభుత్వ అధికారులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు