Narendra modi

ఆవేదన వ్యక్తం చేసిన నరేంద్ర మోదీ

గుజరాత్లోని రాజ్కోట్లో తన విగ్రహాన్ని ప్రతిష్టించడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఆలయం నిర్మించడం  వ్యక్తిగతంగా చాలా బాధించిందని మోదీ అన్నారు. ఇదా మన సంస్కృతి మనకు నేర్పిందంటూ , మీకు తీరిక, సమయం ఉంటే దయచేసి.. మన దేశాన్ని పరిశుభ్రంగా మార్చాలన్న కలను నెరవేర్చడానికి స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం చేపట్టాలని  మోదీ తన మద్దతుదారులకు ట్వీట్టర్లో సలహా ఇచ్చారు. ఇటువంటివి మళ్లీ పునరావృతం చేయరాదంటూ సూచించారు.

ప్రధాని మోడీకి గుజరాత్ లో గుడి!

పవిత్ర భారతదేశంలో వీధికో గుడి దర్శనం ఇస్తుంది. మనకు ఉన్న దేవుళ్ళు అంతమంది మరి. కొందరు తమ అభిమాన సినీ తారల కోసం కూడా గుళ్ళు కడుతూ ఉంటారు. అయితే రాజకీయనాయకులకు గుడి కట్టినట్లు మాత్రం చాలా అరుదుగా వింటుంటాం. ఇక ఇప్పుడు తాజాగా కొంతమంది ప్రజలు తమ అభిమాన నాయకుడికి గుడి కట్టి రెండు పూటలా దీపారాధన కూడా చేస్తున్నారట. దేశవ్యాప్తంగా అభిమాన గణం ఉన్న ప్రధాని మోడీకి గుజరాత్ లో ఉన్న ఫాలోయింగే వేరు. […]

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేజ్రీవాల్ కు ఫోన్……

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి ఆమ్ ఆద్మీ పార్టీ విజయభేరీ మోగించడం ఖాయమై పోయింది. దీంతో ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు, సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం ముందు బీజేపీ వెలవెలబోయింది.

ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.850 కోట్ల నిధులు!

అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కరుణ చూపింది. ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద భారీ మొత్తంలో నిధులను మంజూరు చేసింది. ముఖ్యంగా.. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని 7 జిల్లాల అభివృద్ధికి కేంద్ర ఆర్థిక శాఖ 350 కోట్ల రూపాయలు విడుదల చేయాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా 2014-2015 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను పారిశ్రామిక ప్రోత్సాహకాలకు […]

The celebrations of India’s 66th Republic Photo Gallery…….

The celebrations of India’s 66th Republic Photo Gallery

ప్రపంచం యావత్తు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న గణతంత్రవేడుకలు….

 ప్రపంచం యావత్తు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న గణతంత్రవేడుకలు…. ఢిల్లీలో జరుగుతున్న వేడుకలకు ప్రపంచ పెద్దన్నగా పేరుగాంచిన ఒబామా ముఖ్యఅతిధిగా హాజరు అవుతుండటంతో ప్రపంచం దృష్టి యావత్తు భారత్ వైపే ఉంది. భారత్ కూడా అందుకు తగిన విధంగానే అంచనాలకు మించి ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భారీ బలగాలను రక్షణగా నియమించారు. సీసీ టీవీ ఫుటేజ్ లను అమర్చి హెలికాప్టర్ల ద్వారా కూడా గగనతలంలో నుంచి పరిశీలించనున్నారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన […]

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసిన కే.సీ.ఆర్?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ వైరస్ మరింతగా విస్తరిస్తోంది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. తక్షణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి ప్రత్యేక వైద్య బృందాన్ని పంపాల్సిందిగా కోరారు. అలాగే, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రితోనూ ఆయన మాట్లాడి పరిస్థితిని వివరించారు. మరోవైపు బుధవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం అత్యవసరంగా సమావేశంకానుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై కేసీఆర్ గుర్రుగా ఉండటమే కాకుండా, ఆ శాఖ ఉన్నతాధికారులపై ఆయన […]

అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానినరేంద్రమోడీ, గవర్నర్ నరసింహన్ తీవ్ర దిగ్భ్రాంతి

అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానినరేంద్రమోడీ, గవర్నర్ నరసింహన్ తీవ్ర దిగ్భ్రాంతి అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానినరేంద్రమోడీ, గవర్నర్ నరసింహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంతదురదృష్టకరమైన ఘటనగా అభివర్ణించారు. మృతులు కుటుంబాలకుసంతాపం తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలనిఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.  

జార్ఖండ్‌, జమ్మూకశ్మీర్‌ రాష్ఠ్రాలలో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న సందర్భంగా….

మంగళవారం జార్ఖండ్‌, జమ్మూకశ్మీర్‌ రాష్ఠ్రాలలో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న సందర్భంగా రాష్ట్ర కార్యాలయం వద్ద బాణసంచా పేల్చి మిఠాయిలు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ భారత్‌ను ప్రపంచంలో ఆగ్రదేశంగా తీర్చి దిద్దేందుకు ఆహర్నిశ లు కృషి చేస్తున్నారని శాసనసభా పక్ష నేత డాక్టర్‌ లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమవడం సంతోషం -ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

జీఎస్ఎల్వీ ప్రయోగాన్ని విజయవంతంగా ముగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు… జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమవడం సంతోషం -ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ విజయానికి కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందలు’’ అంటూ ఆయన  ట్విట్టర్ ద్వారా  అభినందనలు తెలిపారు

Page 1 of 212