హుదూద్ తుఫాను తొ విశాఖ  నగరం అతలాకుతలం అయ్యింది

 

Waves crash as Typhoon Vongfong approaches Japan's main islands in Kuroshio Town, Kochi prefecture

సెల్ టవర్లు కూలిపోయాయి, విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోయాయి. ఇళ్లు కుప్పకూలాయి, హోర్డింగులు పడిపోయాయి. పెద్దపెద్ద చెట్లు విరిగిపడి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే లెక్కలేనన్ని మూగజీవాలు ఈ తుఫాను కారణంగా మరణించాయి. అయితే వాటి కళేబరాలను తొలగించడం అధికారులకు ఇప్పటికిప్పుడు సాధ్యం కావట్లేదు.200 పొక్లెయిన్లను ఉపయోగించి రోడ్లు క్లియర్ చేస్తామని అదికారులు చెబుతున్నారు.

దాంతో రోడ్లమీద పడి ఉన్న పశు కళేబరాల కారణంగా అంటువ్యాధులు ప్రబలుతాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా, ఎవరికీ తాగేందుకు మంచినీళ్లు కూడా దొరకట్లేదు. దాంతో దిక్కుతోచని పరిస్థితిలో వరదనీటినే తాగుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని, దీంతో ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.

2 Responses to హుదూద్ తుఫాను తొ విశాఖ  నగరం అతలాకుతలం అయ్యింది

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *