అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 20మంది మృతి చెందినట్లు సమాచారం

Happy Birth Day to Bipasha Basu
ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాందీ మున్సిపల్ స్టేడియంలో భారి ఎర్పాట్లు

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 20మంది మృతి చెందినట్లు సమాచారం

 పెనుకొండ,మడకశిర మార్గంలో బుధవారం ఉదయం  పల్లె వెలుగు ఆర్టీసీ  బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో  20మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు మడకశిర నుంచి పెనుకొండ వెళుతుండగా మలుపు తిరిగే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో మొత్తం సుమారు 50మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందినవారిలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు, ఓ కానిస్టేబుల్ తో పాటు ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం. 

Happy Birth Day to Bipasha Basu
ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాందీ మున్సిపల్ స్టేడియంలో భారి ఎర్పాట్లు

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *