సంక్రాంతి కానుకగా ‘గోనగన్నా రెడ్డి’ వీడియో

పవన్ కళ్యాణ్‌కు పద్మభూషణ్ అవార్డు?!!
అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌ పర్యటన షెడ్యూల్‌…..

Allu-Arjun-Gona-Ganna-Reddy-First-Look-HD-Stills-From-Rudhramadevi-Movie-2-620x330స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బందిపోటుగా గోన గన్నారెడ్డిపాత్రలో నటిస్తున్న సినిమా ‘రుద్రమదేవి’.

గోనగన్నా రెడ్డిగా అల్లు అర్జున్ పై విడుదలా చేసిన ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే రుద్రమదేవికి సంబందించిన బన్ని మేకింగ్ వీడియోను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం సంక్రాంతి కానుకగా జనవరి 15వ తేదీ ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయనున్నరు. గోనగాన్నా రెడ్డి పాత్రకి జోడీగా కేథరిన్ ట్రేసా కనిపించనుంది.

అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చారిత్రాత్మక సినిమాను శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ టీం వర్క్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో దర్శకుడు గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అనుష్క జోడిగా చాళుక్య వీరబద్రుడి పాత్రలో దగ్గుబాటి రానా నటించారు.

కృష్ణం రాజు, సుమన్, ప్రకాశ్‌ రాజ్, నిత్యా మీనన్, క్యాథరిన్, ప్రభు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇళయరాజా ఈ సినిమాకు సంగీత దర్శకుడు. తోట తరణి కళా దర్శకత్వం వహిస్తున్నారు. భారతదేశపు తొలి హిస్టారికల్ త్రిడి సినిమాగా ‘రుద్రమదేవి’ చరిత్రకెక్కింది.

పవన్ కళ్యాణ్‌కు పద్మభూషణ్ అవార్డు?!!
అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌ పర్యటన షెడ్యూల్‌…..

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *