గుంటూరు జిల్లా నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాలలో ఓ లెక్చరర్పై విద్యార్థిని యాసిడ్తో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది….

హైదరాబాద్‑లో సన్నీ లియోన్ సందడి……
చిరిగిన, చిల్లుల పడిన కరెన్సీ నోట్లతో ఇబ్బందిపడుతున్న వారికి శుభవార్త…..

acid-attackగుంటూరు జిల్లా నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాలలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని కాలేజీ లెక్చరర్ వెంకటరమణపై  సౌజన్య అనే విద్యార్థిని యాసిడ్ దాడి చేసింది. ఈఘటనలో తీవ్రంగా గాయపడ్డ లెక్చరర్ ను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

నరసరావుపేటకు చెందిన సౌజన్యను అదే పట్టణంలో ఓ ప్రైవేటు కాలేజిలో మాథ్స్ లెక్చరర్గా పనిచేసే వెంకటరమణ కొన్నాళ్ల పాటు ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి కొంతకాలం కలిసి తిరిగాడు.

గత ఆగస్టు 15వ తేదీన అతడికి మరో యువతితో పెళ్లయింది. ఎందుకిలా మోసం చేశావంటూ దీనిపై సౌజన్య అతడిని నిలదీయగా, కావాలంటే రెండోపెళ్లి చేసుకుంటానంటూ నీచంగా మాట్లాడాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి, అవమానానికి గురైన సౌజన్య.. యాసిడ్ తీసుకుని కాలేజి వద్దకు వచ్చింది. వెంకటరమణను కాలేజి నుంచి బయటకు పిలిపించి, మొహం మీద, శరీరం మీద యాసిడ్ పోసింది. దాంతో అతడి ఒళ్లంతా కాలిపోయింది. ప్రస్తుతం అతడు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతానికి ప్రాణాపాయం లేదు గానీ, తీవ్ర గాయాలు అయ్యాయని వైద్యులు చెబుతున్నారు. సౌజన్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను పూర్తిస్థాయిలో విచారించే అవకాశం ఉంది.

హైదరాబాద్‑లో సన్నీ లియోన్ సందడి……
చిరిగిన, చిల్లుల పడిన కరెన్సీ నోట్లతో ఇబ్బందిపడుతున్న వారికి శుభవార్త…..

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *