కనకవర్షం కురిపిస్తున్న పీకే.. రూ.635 కోట్ల వసూళ్లు!
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం పీకే. ఈ చిత్రం భారత చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు నమోదైన రికార్డులను తిరగరాస్తోంది. గత డిసెంబర్ 19వ తేదీన విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటి వరకు 600 కోట్ల రూపాయలకు పైగా వసూళ్ళను రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించే దిశగా పయనిస్తోంది. గతంలో1 అమీర్ ఖాన్ నటించిన ధూమ్ 3 చిత్రం రూ.540 కోట్లను వసూలు చేసింది. ఈ రికార్డును పీకే అధికమించింది. ఈ చిత్రం కలెక్షన్లు ఇప్పటి వరకు భారత్‌లో రూ.475 కోట్లు (గ్రాస్), విదేశాల్లో రూ.160 కోట్ల (గ్రాస్)తో మొత్తం 635 కోట్ల వసూళ్లను సినిమా నమోదు చేసింది. బాలీవుడ్‌లో రూ.300 కోట్ల నికర వసూళ్లను సాధించిన తొలి హిందీ చిత్రంగా ఇప్పటికే ‘పీకే’ నిలిచింది.