రాష్ట్ర సీఐడీ విభాగంలో 32 హోంగార్డు పోస్టుల భర్తీకి ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది..

ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు…
  కర్నూలు జిల్లా అవుకు మండలం మెట్టుపల్లె గ్రామ సమీపాన వేగటాళ్ల ఉచ్చులో చిరుత….

 

ap-police-home-guard-recruitment (1)ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో పనిచేసేందుకు ఈ నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు కర్నూలు సీఐడీ అధికారులు తెలిపారు.

డీ క్యాటగిరి విభాగంలో

కంప్యూటర్‌ ఆపరేటర్‌ -12,

డ్రైవర్లు -12,

దోబీలు -2,

కార్పెంటర్లు -2,

ఎలక్ర్టిషీయన్లు -2,

ప్లంబర్లు -2

ఉద్యోగాలు ఉన్నాయి. 13 జిల్లాల ఏ అభ్యర్థులైనా ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులను పోలీసు వెబ్‌సైట్‌ ద్వారాకానీ, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, తిరుపతి, కర్నూలులోని ప్రాంతీయ సీఐడీ కార్యాలయంలోగాని పొందవచ్చు. అభ్యర్థి 18 ఏళ్ల పైబడి 50 ఏళ్ల లోపు ఉండాలి. 7వ తరగతి చదివి ఉండాలి. డ్రైవర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎల్‌ఎంవీ, హెచ్‌ఎంవీ లైసెన్స్‌ కలిగి ఉండాలి. పురుష అభ్యర్థులు 160 సెం.మీ ఎత్తు, మహిళ అభ్యర్థులు 150 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలి. దరఖాస్తులను ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోపు ప్రాంతీయ సీఐడీ కార్యాలయంలో ఇవ్వాలి.

హోంగార్డుల ఎంపిక ఈ నెల 27, 28వ తేదీల్లో విజయవాడ సిటీలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తారు.

కావాల్సిన అర్హత పత్రాలు :  దరఖాస్తుతో పాటు విద్యార్హత, సాంకేతిక అర్హత పత్రాల నకళ్లు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ నకళ్లు, రెసిడెన్సీ ఫ్రూఫ్‌, పుట్టిన తేదీ నకళ్లు, కులదృవీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది.

ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు…
  కర్నూలు జిల్లా అవుకు మండలం మెట్టుపల్లె గ్రామ సమీపాన వేగటాళ్ల ఉచ్చులో చిరుత….

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *