దానిమ్మ జ్యూస్‌తో వృద్ధాప్య ఛాయలకు బై చెప్పండి!….
దానిమ్మ జ్యూస్‌తో వృద్ధాప్య ఛాయలకు బై చెప్పండి!
రోజు ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్‌తో వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు.. దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్స్ మిమ్మల్ని యంగ్‌గా కనబడేలా చేస్తుంది. యాంటీఏజింగ్ ఎఫెక్ట్స్‌ను పుష్కలంగా అందించే ఔషధగుణాలు ఇందులో అధికంగా ఉన్నాయి. దానిమ్మ నేచురల్ కొలెస్ట్రాల్ బూస్టర్. ఇందులో గ్రీన్ టీలో కంటే అధికంగా యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది శరీరంలో ధమనులను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది.
అలాగే ఆపిల్ కంటే దానిమ్మలో మరిన్ని ఎక్కువ ఐరన్ కంటెంట్ దాగివున్నదని అందుకే రక్తహీనతతో బాధపడే వారు ఆపిల్స్ కంటే దానిమ్మను ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తుంటారు.