#City News #District News #National News #News

అవినీతిపై సమాచారం ఇవ్వండి టోల్‌ఫ్రీ నెంబరు 1064 కు…

fight corruptionఅవినీతిపై సమాచారం ఇవ్వండి  ఏసీబీ డీఎస్పీ ఎస్ఎం బాషా

ఆధునిక సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉన్నా.. అవినీతి అక్రమాల వల్ల ఎంతో మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవినీతిని అరికట్టడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి.  ప్రజలు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలంటే టోల్‌ఫ్రీ నెంబరు 1064కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

 

 

  • అవినీతిని అరికట్టాలంటే.. ఏ అధికారి అయినా లంచం డిమాండ్‌ చేస్తే నిలదీయాలి. లేదా ఏసీబీని ఆశ్రయించాలి.
  • ప్రజలు కూడా ఆదాయానికి మించి ఆస్తులున్న అధికారుల వివరాలను ఏసీబీకి అందించాలి.
  • సంక్షేమ వసతి గృహాల్లో వార్డెన్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పిల్లలకు ఇచ్చే మెనూ పాటించకుండా జేబులు నింపుకుంటున్నారు.
  • పోలీసుశాఖలో అవినీతి హెచ్చుమీరిపోయింది. హోంగార్డు నుంచి ఉన్నతాధికారుల వరకు కొంతమంది లంచం లేనిదే పనిచేయడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ అధికారులు ఈ విభాగంపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచక పోవడంతో అవినీతి మూడు పూలు, ఆరు కాయలుగా ఉంది. ప్రజలు కూడా ఈ విభాగంపై ఫిర్యాదులు చేయడం లేదు.
  • రెవెన్యూ విభాగంలో ఆర్డీవో కార్యాలయం మొదలుకుని వీఆర్వో వరకు పట్టాదారుపాసుపుస్తకాల మంజూరు, కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో అవినీతి పేరుకుపోయింది. ఈ విభాగంలో ఎక్కువమంది ఏసీబీకి పట్టుపడటం గమనార్హం.
  • పౌరసరఫరాలశాఖలో వినియోగదారుడికి సరుకులు సక్రమంగా అందడం లేదు. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. తూనికలు, కొలతల్లో మోసం జరుగుతున్నా పట్టించుకునే అధికారులే కరువయ్యారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగే ఈ విభాగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *