విద్యార్థినులకు హాస్టల్లో భద్రత ఉందా? అన్న ప్రశ్న మూడు రాష్ట్రాల ను కదిలించింది

camera-lens-pngవిద్యార్థినులకు హాస్టల్లో భద్రత ఉందా? అన్న ప్రశ్న మూడు రాష్ట్రాల ను కదిలించింది .ఊరుగాని ఊరొచ్చి హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థినులతో ఓ ఎలక్ట్రీషియన్ అసభ్యకరంగా ప్రవర్తించాడు.

బాత్రూముల్లో స్నానం చేస్తున్న విద్యార్థినులను వీడియో తీశారన్న సమాచారంతో కంచిలోని ఓ వర్సిటీలోని విద్యార్థుల్లో ఆగ్రహం రేగిం ది. యాజమాన్యం నిర్లక్ష్య పూరితంగా సమాధానం ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బస్సులపై ప్రతాపం చూపించారు. కాంచీపురంలో ఓ ప్రైవే టు వర్సిటీ ఉంది. ఈవర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు మూడు వేల మంది వరకు చదువుకుంటున్నారు. వీరికి ఆ యాజమాన్యం హాస్టల్ సౌకర్యం కల్పించింది. ఆ హాస్టల్లో వార్డెన్‌గా పనిచేస్తున్న ఒకరికి సన్నిహితుడైన ఎలక్ట్రీషియన్ విద్యార్థినులతో అసభ్యకరం గా ప్రవర్తించాడు. అంతేకాకుండా స్నానం చేస్తున్న విద్యార్థినుల్ని రహస్యంగా తన మొబైల్ కెమెరాలో బంధించాడు. ఎన్నాళ్ల నుంచి ఈ తంతు సాగుతున్న దో ఏమోగానీ, బుధవారం కొందరు విద్యార్థినులు ఎలక్ట్రీషియన్ నిర్వాకాన్ని పసిగట్టారు. ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *