విక్రమ్ ‘ఐ’ రన్ టైం బాగా ఎక్కువ

Vikram-Ai----07.01-యావత్‌ సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ఐ’ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ‘ఐ’ సినిమా రన్ టైం 3 గంటల 8 నిమిషాలు(188 నిమిషాలు) అని సమాచారం. ప్రస్తుతం ఈ రన్ టైం ఉన్న సినిమాని సెన్సార్ కి పంపుతున్నట్లు తెలిసిందే. సెన్సార్ పూర్తైన తర్వాత ఇందులో ఒక 8 నిమిషాలు కట్ చేసి టోటల్ గా 3 గంటల సినిమాని రిలీజ్ చేసేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంత ఎక్కువ రన్ టైం…ఎంతో పకడ్బందీ స్క్రీన్ ప్లే ఉంటే తప్ప ఒప్పించటం కష్టమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *