‘స్వచ్ఛ భారత్‌ని నిర్మిస్తామం’టూ ప్రధాని మోదీ ప్రతిజ్ఞ

Happy Birth Day to Lal Bahadur Shastri
Happy Birth Day to Rachana Banarjee

‘స్వచ్ఛ భారత్‌ని నిర్మిస్తామం’టూ ప్రధాని మోదీ ప్రతిజ్ఞ చేసే రాజ్‌పథ్‌ రహదారిని ఇప్పటికే అద్దంలా తీర్చిదిద్దారు. modi-jhadu-3_650_100214120739 గురువారం దేశవ్యాప్తంగా 30 లక్షల మంది ప్రభుత్వ సిబ్బంది చీపుర్లు పట్టుకొని..ప్రతిజ్ఞ తీసుకోనున్నారు. శుద్ధి కోసం పరిశ్రమ! ఆరోగ్య భారతం కోసం పరిక్రమ! దారుల్లో, మనోవీధుల్లోని దుమ్ముని దులిపేసేందుకు కోట్లాది చేతుల కరసేవ!.. ‘స్వచ్ఛ భారత్‌ మిషన్‌’ సందేశాన్ని అందుకునేందుకు దేశం సిద్ధమవుతున్నది. ఇలా ప్రతిచోటా సమష్టి శ్రమ దృశ్యం కనిపిస్తుంది. ప్రధాని మోదీ తానే స్వయంగా ఢిల్లీలోని వాల్మీకి కాలనీలో శుద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు. గురువారం ఉదయం మహాత్ముడి సమాధి వద్ద నివాళి అర్పించి..ఆ వెంటనే రాజ్‌పథ్‌కు చేరుకొని దేశ ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తారు. అనంతరం ప్రధాని మోదీ చీపురు పడతారు. అలాగే.. కాలేజీ విద్యార్థులు, యువత, మహిళలు, పిల్లలు.. అంతా స్వచ్ఛందంగా ఈ శ్రమ కృతువులో భాగస్వాములు అవుతారు. ‘పరిశుభ్ర భారత్‌ను సాధించుకునేందుకు జరుగుతున్న కృషికి మా సాయం ఉంటుంద’ని ఒబామా.. మోదీతో కలిసి వాషింగ్టన్‌ పోస్టుకు రాసిన వ్యాసంలో హామీ ఇవ్వడం విశేషం.

Happy Birth Day to Lal Bahadur Shastri
Happy Birth Day to Rachana Banarjee

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *