కార్పొరేట్‌ స్థాయిలో రోగుల కు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని పెద్దాసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో తీర్మానించారు.

అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆధార్‌తో లింకప్
Kurnool blood doners

కార్పొరేట్‌ స్థాయిలో రోగుల కు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని పెద్దాసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో తీర్మానించారు. Kurnool-Government-Hospitalబుధవారం మ ధ్యాహ్నం ఆసుపత్రిలోని మార్టన్‌హాలులో హెచ్‌డీఎస్‌ సమావే శం చైర్మన్‌ జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి కర్నూలు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు ఎస్‌వీ మోహన్‌రెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాంప్రసాద్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఉమామహేశ్వర్‌ హాజరయ్యారు.   కర్నూలు ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి వైద్యులు మందులు బయటకు రాస్తున్నారని, జనరిక్‌ మందులనే రాయాలని సూచించారు. అలాగే రోగులకు సత్వరమే వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
.  ఆసుపత్రి విధానాన్ని సమూలంగా మార్పు చేయాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే సూచించారు. పారిశుధ్య, శానిటేషన్‌పై ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశపరచి మెరుగుదలకు కృషి చేయాలన్నారు. త్వరలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్‌ ఆరోగ్య పథకం అమలులోకి తెస్తుందన్నారు. ఇప్పటికే ఆసుపత్రి అభివృద్ధికి రూ.300 నుంచి 500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు.  కలెక్టర్‌ మాట్లాడుతూ ఆసుపత్రిలో నాణ్యమైన సేవలకు గాను త్వరలో వైద్యులు, సిబ్బందికి బయోమెట్రిక్‌ను అమలు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. రోడ్ల మరమ్మతులు చేపడుతామన్నారు. పందుల సంచారాన్ని తగ్గించేందుకు ఆసుపత్రి ప్రహరీని పెంచి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఆసుపత్రిలో అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పా టు చేసి, ప్రస్తుతం ఉన్న సెక్యురిటీ స్థానంలో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అమలు చేస్తామన్నారు.

సమావేశం లొ కొన్ని తీర్మానాలు ప్రకటించడం జరిగింది

.  ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన రాయలసీమ ఇ న్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(రిమ్స్‌)కు మాస్టర్‌ప్లాన్‌ త యారు చేయడం
.  పెరుగుతున్న రోగులకు అనుగుణంగా స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఎలక్ర్టికల్‌ సిబ్బంది కాంట్రాక్ట్‌ ప్రతిపాదికన భర్తీ చేయడం
.  ప్రస్తుతం ఉన్న సెక్యురిటీ స్థానంలో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయడం. శానిటేషన్‌, సెక్యూరిటీ సిబ్బంది ఆలస్యంగా వస్తే వేతనంలో కోత విధించడం
.  ఆసుపత్రిలో వైద్యులు, ఉద్యోగులు, సిబ్బందికి బయోమెట్రిక్‌ విధానం అమలు చేయడం
.  అత్యవసర సమయంలో సూపరింటెండెంట్‌ హెచ్‌డీఎస్‌ నిధులను రూ.10 వేల నుంచి 20 వేల వరకు వాడుకోవడం
.  రేడియాలజీ విభాగంలోని పాత పరికరాలకు మళ్లీ టెండర్లకు వెళ్లడం. ఇక ఐరన్‌ వేస్ట్‌కు ఇ-టెండర్లకు వెళ్లడం
.  ఆరోగ్యశ్రీలో 17 విభాగాల్లో రూ. 3.6 కోట్ల పరికరాలు కొనుగోలు చేశారు. ఇంకా అవసరమైన విభాగాలకు పరికరాలను కొనుగోలుకు అంగీకారం. ఆరోగ్యశ్రీ కేసులను ఎక్కువగా చేసి ఆదాయాన్ని పెంచుకోవడం
.  600 పడకల సామర్థ్యంతో ఆరోగ్యశ్రీ రోగులకు (జీ+4) ప్రత్యేక వార్డు నిర్మించడం.

అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆధార్‌తో లింకప్
Kurnool blood doners

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *