ఫిభ్రవరిలో చైనా థియేటర్స్ లో ‘ఐ’
ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విలక్షణ హీరో విక్రమ్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఐ’. అమీ జాక్సన్ హీరోయిన్. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ అస్కార్ ఫిలిమ్స్ ప్రై.లి. బ్యానర్ పై అస్కార్ రవిచంద్రన్ ఈ సినిమాని నిర్మించారు. నిజానికి ఈ సినిమాలో చైనాలో షూట్ చేసిన పార్ట్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే సినిమాని చైనాలో మాత్రం విడుదల చేయలేదు. కానీ ఇప్పుడు సినిమాని ఫిభ్రవరిలో చైనాలో అత్యధిక థియేటర్స్ లో విడుదల […]
‘ఐ’ అమెరికాలో మాత్రమే 450థియేటర్లలో విడుదలవుతూ రికార్డు….
‘ఐ‘ అమెరికాలో మాత్రమే 450థియేటర్లలో విడుదలవుతూ రికార్డు…. భ్రాంహాండాల రూపకర్త శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన విక్రమ్ చిత్రం ‘ఐ‘. సంక్రాంతి సందర్భంగా బుధవారం విశ్వ వ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ చిత్రం కేవలం అమెరికాలో మాత్రమే 450థియేటర్లలో విడుదలవుతూ రికార్డు సృష్టించనుంది. ఇప్పటి వరకూఅమెరికాలో బాలీవుడ్ సినిమా కూడా ఈ స్థాయిలో విడుదల కాకపోవడం గమనార్హం. కాగా అమెరికాలో ‘ఐ‘ తెలుగు, తమిళం, హిందీ అంటూ మూడు భాషల్లో విడుదల కానుంది. భారత […]
తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కించిన ‘ఐ’ సినిమా ఆడియో
తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కించిన ‘ఐ’ సినిమా ఆడియో ఆవిష్కరణోత్సవం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ… తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉన్నానని, భవిష్యత్ లో తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తానని చెప్పారు. ఇది త్వరలోనే కార్యరూపం దాలుస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మగధీర సినిమా చూసి రాజమౌళి అభిమాని అయ్యాయని శంకర్ అన్నారు. ‘ఐ’ సినిమా అందరినీ అలరిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
శంకర్ ‘ఐ’ విడుదల తేదీ హమ్మయ్య!
విక్రమ్, శంకర్ ల భారీ చిత్రం ‘ఐ’ . ఈ చిత్రం రిలిజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతికి రాదంటూ వార్తలు వచ్చాయి. దాంతో అభిమానులు కంగారుపడ్డారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ తేదీ ని ప్రకటించారు. జనవరి 9న ఈ చిత్రం విడుదల చేస్తామని తేదీని ఖరారు చేసినట్లు తమిళ వర్గాల సమాచారం. ఇప్పటికే మృగరాజు వేషంలో ఉన్న ప్రచార చిత్రం అందరినీ ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచుతోంది.
ఐ ’ పాటల్ని డిసెంబర్ 15న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు…
శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ ఐ ’ పాటల్ని డిసెంబర్ 15న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు ఈ ఆడియో వేడుకకు చైనీస్ సూపర్ స్టార్ జాకీచాన్, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు ముఖ్య అతిధిలుగా వస్తున్నట్లు ఫిలింనగర్ టాక్.
విక్రమ్ ‘ఐ’ కథ లీకైంది!!!
‘ఐ’ చిత్రం కథ బయిటకు వచ్చి తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో , తమిళ మీడియాలో నలుగుతోంది. లీకైందంటూ చెప్పబడుతున్న ఈ కథ ఎంతవరకూ నిజమో కాదో అన్నది రిలీజయ్యేదాక తెలియదు. కథేమిటంటే… ప్రముఖ కండల వీరుడు, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రపంచ మేటి కండల వీరుడు కావాలనేది లింగేశన్ అనే యువకుడి కల. దీని కోసం ఎంతో కష్టపడతాడు. తన కల నెరవేరుతుందన్న సమయంలో అనుకోకుండా ఓ అడ్డంకి ఎదురవుతుంది. అదేంటి.. […]
2014 లో ‘ఐ’ విడుదల లేనట్టే
‘ఐ’ సినిమా 2014లో విడుదలయ్యే అవకాశం లేదు. ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు, ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్స్ ఈ జాప్యానికి ముఖ్యకారణమని తెలుస్తుంది. ఆ పనులు పూర్తయ్యాకే రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద కుర్చుంటాడని సమాచారం. అన్నీ సజావుగా సాగితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శంకర్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెన్నై వర్గాల సమాచారం. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషలతో పాటూ చైనీస్ లో […]