ఐదు కోట్ల రూపాయల బంగారు ఆభరణాల ‘రుద్రమదేవి’ గెటప్ రిలీజ్

విక్టరీ వెంకటేష్‌, పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కలిసి నటిస్తున్న”గోపాల గోపాల” పోస్టర్లు విడుదల
త్వరలో ఏపి కి రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడి…..

rudrama deviప్రముఖ నటి అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న‘రుద్రమదేవి’ సినిమాకు సంబంధించి ఐదు కోట్ల రూపాయల బంగారు ఆభరణాల ‘రుద్రమదేవి’ గెటప్ రిలీజ్…

భారతదేశపు తొలి హిస్టారికల్ 3డి స్టీరియోస్కోపిక్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ పతాకంపై శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణశేఖర్ నిర్మిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా అనుష్క ఆ కాలపు రాణి గెటప్‌లో కనిపించనుంది. ఈ గెటప్ కోసం ఐదు కోట్ల రూపాయల బంగారు ఆభరణాలు ధరించడం విశేషం. 13వ శతాబ్దంలోని కాకతీయ వైభవాన్ని చాటిచెప్పేలా భారీస్థాయిలో రూపొందుతోన్న చిత్రంలో వీరనారీమణిగా అనుష్క కనిపించనుంది. కాకతీయ శిలాతోరణం ముందు రాజసం ఉట్టిపడేలా ధగధగలాడుతూ మెరిసిపోతున్న వీరనారి రుద్రమదేవి చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

విక్టరీ వెంకటేష్‌, పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కలిసి నటిస్తున్న”గోపాల గోపాల” పోస్టర్లు విడుదల
త్వరలో ఏపి కి రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడి…..

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *