గోపాల గోపాల సినిమా…హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు…
గోపాల గోపాల సినిమా …హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు… వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన ‘గోపాల గోపాల’ చిత్రంపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో రఘునాథరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. గోపాల గోపాల సినిమా …హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ అతను తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అక్కినేని అఖిల్ తొలి చిత్రంపై ఫిలింనగర్ లో రోజుకో హాట్ న్యూస్ హల్ చల్ చేస్తోంది…పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్
అఖిల్ ఎంట్రీ గ్రాండ్ గా ఉండేందుకు దర్శక నిర్మాతలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తండ్రి పాత్రలో నాగార్జున కనిపించనున్నట్లు, … పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా గెస్ట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో పవన్ కల్యాణ్ …
ప్రస్తుతం పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో పవన్ కల్యాణ్ బస చేశారు. ఆయన ‘గోపాల గోపాల’ సినిమా షూటింగు కోసం కాశీ పట్టణంలో వున్నాడు. ఆయనపై ఓ ప్రత్యేకమైన పాటను అక్కడ చిత్రీకరిస్తున్నారు. వెంకటేష్, పవన్ కలసి నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.
‘చిన్నదాన నీ కోసం’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ముద్దాడి నితిన్ తన అభిమానాన్ని సభాముఖంగా చాటారు….
‘చిన్నదాన నీ కోసం’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగింది.ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ… అభిమానులు లేకుంటే ఏ హీరో లేడని, జయాపజయాలతో సంబంధం లేకుండా కథానాయకులకు అండగా నిలిచేది అభిమానులేనని పేర్కొన్నారు. ‘చిన్నదాన నీ కోసం’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ముద్దాడి నితిన్ తన అభిమానాన్ని సభాముఖంగా చాటారు….పవన్ ఫోటో ఎక్కడ పెట్టుకుంటారని అడగ్గా… ఆయన తన గుండెల్లో ఉన్నారంటూ నితిన్ జవాబిచ్చారు.
బాలకృష్ణ 100వ సినిమా కోసం కసరత్తులు
యువరత్న బాలకృష్ణ, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌లు కలిసి నటిస్తున్నారని తాజాగా ఫిలింనగర్ టాక్ ఈ మల్టీస్టారర్ చిత్రం కి బోయపాటే దర్శకత్వం వహిస్తున్నారని సమాచారం. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అతిధి పాత్రలో కనిపించనున్నారట. పవన్‌కు అత్యంత సన్నిహితుడు పీవీపీ అధినేత పోట్లూరి వర ప్రసాద్ ఈసినిమాను నిర్మించనున్నారని టాక్ . ఇదే నిజమైతే దీనికోసం ఇద్దరి హీరోల ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని బోయపాటి తీవ్ర కసరత్తులు చేయాల్సి ఉంటుంది.