ఒరే! ఈ బుట్టలో రెండు జామపండ్లు పెట్టాను. ఒకటే వుందేమిట్రా?!!

తల్లి : ఒరే! ఈ బుట్టలో రెండు జామపండ్లు పెట్టాను. ఒకటే వుందేమిట్రా?!! కొడుకు : రాత్రి చీకట్లో చూసి, ఒకటే వుందనుకున్నానమ్మా!!!

అన్నంలో రాళ్ళు లేకుండా ఏరలేవా?

అప్పారావు (భార్యతో అంటున్నాడు): దేవుడు నీకు రెండు కళ్ళు ఇచ్చాడుగా అన్నంలో రాళ్ళు లేకుండా ఏరలేవా? మణి (భర్తతో): దేవుడు మీకు కూడా 32 పళ్ళు ఇచ్చాడుగా . ఆ మాత్రం నమలలేరా………!

“ఏవండోయ్… ఈ రోజు మన పళ్ళై సంవత్సరం నిండింది. వచ్చేటప్పుడు కోడిని పట్రండి

“ఏవండోయ్… ఈ రోజు మన పళ్ళై సంవత్సరం నిండింది. వచ్చేటప్పుడు కోడిని పట్రండి. పలావ్ చేసుకుందాం” చెప్పింది కనకం. “ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?” పెదవి విరుస్తూ అన్నాడు కనకారావ్.

అమెరికా వెళ్ళే విమానంలో అమెరికా అతని ప్రక్కన తెలుగు అతను కూర్చున్నాడు. వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ….

(అమెరికా వెళ్ళే విమానంలో అమెరికా అతని ప్రక్కన తెలుగు అతను కూర్చున్నాడు. వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ….) తెలుగు అతను : “మీ పేరు తెలుసుకోవచ్చా”? (“Hello my I know your name please?”) అమెరికా అతను:”I am Bond……..James Bond“ అమెరికా అతను:”and you?” తెలుగు అతను: “I am sai…….. Venkata Sai………. Siva Venkata Sai……….. Lakshminarayana Siva Venkata Sai……….. Raja Sekhara Srinivasula Siva Venkata Sai………….Bommiraju […]

డాక్టర్ … పిచ్చోడితో- ఏంచేస్తున్నావ్?….

డాక్టర్ … పిచ్చోడితో- ఏంచేస్తున్నావ్?. పిచ్చోడు:చెక్కని కోస్తున్నా… డాక్టర్: మరి నీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు. పిచ్చోడు: వాడా..వాడికి కొంచెం పిచ్చి. వాడు తను లైట్ బల్బ్ అని అనుకుంటున్నాడు. డాక్టర్- మరి నువ్ చెప్పొచ్చుగా దిగమని. పిచ్చోడు: అంటే నేను చీకట్లో పని చేసుకోవాలా….

ప్రతి ఒక్కరూ ఒక్కో గాంధీ… ఒక్కో నెహ్రూ… ఒకో ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి”

“మీలో ప్రతి ఒక్కరూ ఒక్కో గాంధీ… ఒక్కో నెహ్రూ… ఒకో ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి” ఆవేశంగా పాఠం చెబుతున్నాడు మాస్టారు. “అంటే మేమందరం చావాలనా మీ ఉద్దేశ్యం?” లేచి కోపంగా అడిగాడో విద్యార్ధి.