#City News #District News #News

Since August 2014 Subsidized Items supplied in Ration shop will be rice, sugar, kerosene only.

జిల్లాలో 11.50 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులున్నారు. వీరికి ప్రతినెలా 2,411 చౌక డిపోల ద్వారా రాయితీపై తొమ్మిది రకాల సరుకులు పంపిణీ చేసేవారు. కాగా ఆరు మాసాలుగా వంట నూనె, ఆగస్టు నుంచి కందిపప్పు, గోధుSince-August-2014మ పిండి, గోధుమల సరఫరా నిలిపివేశారు. గత నెల నుంచి బియ్యం, పంచదార, కిరోసిన్ మాత్రమే సరఫరా చేస్తున్నారు. చౌకదుకాణాల్లో రూ.50కే లభించే కిలో కందిపప్పు బహిరంగ మార్కెట్లో రూ.80, రూ.17కే దొరికే కిలో గోధుమ పిండి రూ.40, రూ.40కే సరఫరా చేసే లీటర్ వంట నూనె రూ.70కు పైగా విక్రయిస్తుండటంతో పేదలు ఎలా కొనాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా దసరా, బక్రీద్, దీపావళి తదితర పండుగలు సమీపిస్తుండటంతో పిండివంటల చేసుకొని ఆరగించాలకున్న పేదల ఆశలు అడి ఆశలు అవుతున్నాయి. జిల్లాలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు పౌరసరఫరా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న సరుకుల్లో ప్రభుత్వం కొన్నింటిని నిలిపివేసింది. బహిరంగ మార్కెట్‌లో కొందామంటే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పేదలు ఆందోళన చెందుతున్నారు.చౌకదుకాణాల్లో రూ.14కే కిలో పంచదార ఇచ్చేవారు. బహిరంగ మార్కెట్లో రూ.40 పలుకుతోంది. వరుస పండుగలు వస్తుండటంతో ప్రతి పిండి వంటలకు పంచదార అవసరమని కార్డుకు కనీసం రెండు కిలోల చక్కెర ఇవ్వాలని పేదలు కోరుతున్నారు

Since August 2014 Subsidized Items supplied in Ration shop will be rice, sugar, kerosene only.

Happy Birth Day to Kannamba

Leave a comment

Your email address will not be published. Required fields are marked *