ఒకసారి ఊహించుకోండి చిరు, బాలయ్య, నాగ్, వెంకీ లు కలిసి ‘అవెంజర్స్’ మూవీ రేంజ్ లో ఒకే పోస్టర్ పై ఉంటే ఎలా ఉంటుందో..

ఒకసారి ఊహించుకోండి చిరు, బాలయ్య, నాగ్, వెంకీ లు కలిసి ‘అవెంజర్స్’ మూవీ రేంజ్ లో ఒకే పోస్టర్ పై ఉంటే ఎలా ఉంటుందో..

స్టార్డం తో సంబంధం లేకుద్నా అన్ని రకాల సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేష్. వెంకటేష్ తన కెరీర్లో ఎన్నో రకాల ప్రయోగాత్మక సినిమాలు చేసారు. టాలీవుడ్ లో ఎప్పుడో ఆగిపోయిన మల్టీ స్టారర్ ట్రెండ్ ని ఆయనే తిరిగి పునఃప్రారంభించారు.  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, ఇప్పుడేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘గోపాల గోపాల’ సినిమాలో నటించాడు.

ఈ సందర్భంగా వెంకటేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మల్టీ స్టారర్ సినిమాల గురించి మాట్లాడుతూ ‘ మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి నేనెప్పుడూ సిద్దంగానే ఉన్నాను. నేను యంగ్ హీరోలైన మహేష్, పవన్ లతోనే కాకుండా నాతోటి హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలతో కూడా చేయడానికి రెడీ. ఒకసారి ఊహించుకోండి చిరు, బాలయ్య, నాగ్, వెంకీ లు కలిసి ‘అవెంజర్స్’ మూవీ రేంజ్ లో ఒకే పోస్టర్ పై ఉంటే ఎలా ఉంటుందో.. ఆ కాంబినేషన్ కి మరికొందరు యంగ్ హీరోస్ తోడైతే ఎలా ఉంటుంది.? అలాంటి మల్టీ స్టారర్ మంచి సినిమాలు చెయ్యాలని నాకూ ఉంటుంది కానీ అలాంటి కథలతో డైరెక్టర్స్ వస్తేనే మేము చేయగలం. లేదంటే మాకు వచ్చిన వాటిలో బెస్ట్ ఎంచుకొని చేస్తుంటామని’ అని అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *