నేడే ఢిల్లీ ఎన్నికలు……
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. గురువారం సాయంత్రం 5గంటలకు అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముగించేశాయి. తుది రోజున పార్టీల ప్రచారం పతాకస్థాయికి చేరింది. దేశ రాజధానిలో ఏ నియోజకవర్గంలో చూసినా చిన్న చిన్న ర్యాలీలు, రోడ్ షోలు, పాదయాత్రల సందడి కనిపించింది.
మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ తమ పూర్తి శక్తి సామర్థ్యాలను వెచ్చించి సాయంత్రం ఆరుగంటల వరకు జోరుగా ప్రచారం నిర్వహించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ చీఫ్ ఆరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెష్ ఉపా ధ్యక్షుడు రాహుల్ గాంధీలు తమదైన శైలిలో ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేశారు. మూడు పార్టీల అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాలకే ప్రచారాన్ని పరిమితం చేసుకున్నారు. చివరి రోజున.. ప్రధాన పార్టీల మధ్య పరస్పర విమర్శలు, ఆరోపణలు తారస్థాయికి చేరాయి. డబ్బు, మద్యం పంపిణీతో ఓటర్లను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపిస్తే.. ఆప్ పార్టీ టికెట్లను సైతం అమ్ముకుందని బీజేపీ ప్రత్యారోపణలు చేసింది.
ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు మరో రెండు రోజుల్లోనే తేలి పోనున్నది. ఈ నెల 7వ తేదీన పోలింగ్, 10వ తేదీన కౌంటింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సం ఘం నిర్ణయించిన విషయం విదితమే. ఈ నెల 10వ తేదీ ఉదయం 11 గంటలకు ఎవరు ఢిల్లీ గద్దెనెక్కె వారేవరో తేలిసోనుంది.