ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా పుట్టిన రోజు

యువన్ శంకర్ రాజా  ప్రముఖ తమిళ్, తెలుగు సంగీత దర్శకులు. మరో ప్రముఖ సంగీత దర్శకులయిన ఇళయరాజా గారిఅబ్బాయి.  16 ఏళ్ళవయసులో  1996లో అరవిందన్ అనే సినిమా ద్వారా సంగీత దర్శకునిగా తెరంగేట్రం చేసిన యువన్ 2013లో వచ్చిన బిరియాని సినిమాతో 15 ఏళ్ళలో 100 సినిమాలకు సంగీతాన్ని అందించారు. తమిళనాట రీమిక్స్ ప్రదాయాన్ని మొదలు పెట్టిన వీరు తెలుగునాట కూడా అనతికాలంలో కీర్తిగడించారు. సిప్రస్ ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్లోఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం అందుకున్నతొలి భారతీయ సంగీత దర్శకుడు కూడా యువన్ శంకర్ రాజా కావడం గమనార్హం.