ఏపీ మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు యోగా తరగతులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు యోగా తరగతులను నిర్వహిస్తున్నారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ తరగతులను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభించారు.