చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే..?

చలి కాలం వచ్చేస్తుంది. సాధారణంగా చలి కాలం సూర్యకాంతి ప్రభావం తక్కువగా ఉంటుంది. అందుకే ఈ కాలంలోనే చర్మం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. అందుకని సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించే క్రీమ్‌లను వినియోగిస్తే మేలు. అలాగే, స్నానం చేయడానికి 10 నిమిషాలు ముందు కొబ్బరినూనెను శరీరమంతా రాసుకుంటే చాలా మంచిది. చలి కదా అని మరీ వేడినీళ్లతో స్నానం చేయకూడదు. చర్మంపై ఉండే నూనెలను వేడి మరింతగా ఆవిరి చేస్తుంది. స్నానానికి గోరువెచ్చని నీటిని వాడితే చాలా మంచిది. […]