వాట్స్యాప్ వినియోగానికి ఏడాదికి రూ.60 చార్జ్
అత్యంత ప్రచారం పొందిన మొబైల్ మెసేజింగ్ సర్వీస్ వాట్స్‌యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది వినియోగిస్తున్నారు. దీనికి భారత్‌లో 7 కోట్ల మంది వినియోగదారులున్నారు. ఈ కంపెనీని ఫేస్‌బుక్ 1,900 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.1,14,000 కోట్లకు) కొనుగోలు చేసింది. ఇంత భారీ మొత్తాన్ని చెల్లించి వాట్స్‌యాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేయడంలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (వ్యాపారాభివృద్ధి) నీరజ్ అరోరా కీలకపాత్ర పోషించారు..వాట్స్‌యాప్ మంచినీళ్లు, విద్యుత్ వంటి యుటిలిటీ సేవ. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించడానికి ఆదాయాన్ని […]