పవర్ ఫుల్ పోలీస్ అఫీసర్‌గా విజయశాంతి!
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్‌గా వెలిగి, తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేసి, ఇటీవల పక్కకు తప్పుకున్న నటి విజయశాంతి. ఈమె చాలా కాలం తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకునేందుకు సిద్ధమైంది. టాలీవుడ్ యంగ్ హీరో గోపిచంద్ నటిస్తున్న ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో, పవర్ ఫుల్ పోలీస్ అఫీసర్‌గా విజయశాంతి కనిపించనుందట. కాగా పోలీసాఫీసర్‌గా వెండితెరకు రీ ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని విజయశాంతి సంతోషం వ్యక్తం చేస్తోంది.