US President Barack Obama’s

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు భారతదేశ పర్యటన…..

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు భారతదేశ పర్యటనకు వచ్చారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ ల్యాండయింది. ఆయనకు స్వాగతం పలికేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు ఎర్రటి శాలువా కప్పుకొని వచ్చారు. ద బీస్ట్ వాహనాన్ని నేరుగా విమానం వద్దకు తీసుకొచ్చారు. ఆ వెంటే ఒబామా భద్రతాధికారుల వాహనం కూడా ఉంది.