Today Chief minister N Chandrababu naidu visting to Kurnool

కర్నూలుకు ముఖ్యమంత్రి రాక

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు శుక్రవారం కర్నూలుకు రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పకడ్బందీగా పూర్తి చేసింది. ఈ సందర్భంగా పొదుపు మహిళలు తదితరులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభకు 8 వేల మంది పొదుపు మహిళలు పాల్గొంటారు. ఉదయం 10.45 గంటలకు కర్నూలు ఎస్‌ఏపీ క్యాంపులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 12.45 గంటల వరకు ఔట్‌డోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.