Swine-Flue-paw-in-Hyderabad

హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ మహమ్మారి పంజా విసురుతోంది

స్వైన్‌ఫ్లూ భారిన పడి ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జంటనగరాలతో పాటు రంగారెడ్డి జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. గత నాలుగు రోజుల్లో 15 కేసులు నమోదయ్యాయి. సోమవారం ఆరునెలల బాలుడు సహా ఏడుగురికి వ్యాధి సోకినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. స్వైన్‌ విస్తృతంగా వ్యాపిస్తుండంతో నగర వాసులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు.