Shreya Ghoshal

పెళ్లి చేసుకున్న గాయని శ్రేయ ఘోషల్…..

ఉత్తమ గాయనిగా లెక్కకు మించిన అవార్డులను గెలుచుకున్న శ్రేయ ఘోషల్  తన చిన్ననాటి స్నేహితుడు అయిన షీలాదిత్య ను  (ఫిబ్రవరి 5) రాత్రి వివాహం చేసుకుంది. శ్రేయ తన ఆనందాన్ని ఫేస్బుక్ పేజీలో వ్యక్తం చేసింది. బెంగాళీ సంప్రదాయం ప్రకారం జరిగిన తమ వివాహాం కుటుంబసభ్యులు, కొంత మంది సన్నిహితుల సమక్షంలో జరిగినట్లు తెలిపింది. మీ అందరి ఆశీస్సులు కావాలని తన పేజీలో తన శ్రేయోభిలాషులను కోరింది. తన భర్త షీలాదత్యతో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది.