పుట్టంరాజువారి కండ్రిగ కు సచిన్ రావాడంతో గ్రామస్తులంతా పండగ లా జరుపుకున్నారు
పుట్టంరాజువారి కండ్రిగ కు ఆదివారం సచిన్ రావాడంతో గ్రామస్తులంతా పండగ లా జరుపుకున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకున క్రికెట్ దేవుడు సచిన్ రావాడంతో . గ్రామస్తులంతా కొత్త దుస్తులు ధరించారు. ఇళ్ల ముందు పుష్పాలతో ముగ్గులు వేసి సచిన్‌కు స్వాగతం పలికారు. దూరాన ఉన్న పిల్లలు, బంధువులందరినీ పిలిపించుకుని క్రికెట్ దిగ్గజాన్ని చూపించారు. టీవీల్లో మాత్రమే చూడగలిగే అభిమాన క్రీడాకారుడు నేరుగా కళ్ల ముందే నిలవడంతో పల్లె జనం పులకించిపోయారు.