జెనీలియా కు జన్మించిన మగబిడ్డకు రియాన్ గా నామకరణం చేశారు
బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్ ముఖ్, నటి జెనీలియాల జంటకు జన్మించిన మగబిడ్డకు రియాన్ గా నామకరణం చేశారు. తనకు బాబు పుట్టినప్పట్నుంచీ రితీష్ కుటుంబం ఆనందంలో మునిగితేలుతోంది. కుమారుడి నామకరణోత్సవాన్ని ఘనంగా జరిపారు. మా అబ్బాయి పేరేంటో తెలుసా. ‘రియాన్ రితేష్ దేశ్‌ముఖ్’ అని రితేష్, జెనీలియా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.