Rayalaseema Bandh

రాయలసీమలో కొనసాగుతున్న బంద్

కర్నూలు : రాజధాని కోసం రాయలసీమలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి.  రాయలసీమ రాజధాని సాధన సమితి గురువారం సీమ బంద్కు పిలుపునిచ్చింది. రాయల సీమలోని నాలుగు జిల్లాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.  తెల్లవారుజాము నుంచే ఆందోళనకారులు వాహనాలను నిలిపివేసి నిరసన చేపట్టారు. కడప అంబేద్కర్‌ సర్కిల్లో టైర్లు తగులబెట్టి ఆందోళన నిర్వహించారు. డిపోల్లోంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. బంద్‌ సమాచారం ముందుగా తెలియజేయడంతో దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు.